Ravanasura Movie Review: ‘రావణాసుర’ రివ్యూ.. రవితేజ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే ?..

ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో వరస విజయాలు అందుకుని జోరు మీదున్న రవితేజ.. హ్యాట్రిక్ కోసం రావణాసురతో వచ్చారు. పైగా ఇందులో ఆయన విలనిజం కూడా పండించారు. మరి ఈ సినిమాతో ఆయన వరసగా మూడో విజయాన్ని అందుకున్నారా లేదా అనేది రివ్యూలో చూద్దాం..

Ravanasura Movie Review: 'రావణాసుర' రివ్యూ.. రవితేజ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే ?..
Ravanasura
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 07, 2023 | 2:17 PM

మూవీ రివ్యూ: రావణాసుర

నటీనటులు: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయెల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, జయరాం, రావు రమేష్, హైపర్ ఆది, హర్షవర్ధన్ తదితరులు

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

ఇవి కూడా చదవండి

సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ ఖన్నన్

కథ, మాటలు: శ్రీకాంత్ విస్సా

నిర్మాత: అభిషేక్ నామా

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ

ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో వరస విజయాలు అందుకుని జోరు మీదున్న రవితేజ.. హ్యాట్రిక్ కోసం రావణాసురతో వచ్చారు. పైగా ఇందులో ఆయన విలనిజం కూడా పండించారు. మరి ఈ సినిమాతో ఆయన వరసగా మూడో విజయాన్ని అందుకున్నారా లేదా అనేది రివ్యూలో చూద్దాం..

కథ:

రవీందర్ (రవితేజ) ఓ జూనియర్ లాయర్. కాలేజీలో తన జూనియర్ అయిన సీతామాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గరే అసిస్టెంట్‌గా జాయిన్ అవుతాడు. చిన్న చిన్న కేసులు డీల్ చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో అతడి దగ్గరికి ఓ హత్య కేసు వస్తుంది. అది చిన్న కేైస్ కాదు.. ఒక ఫార్మా కంపెనీ యజమాని (సంపత్)ని కావాలనే ఒకరు హత్య చేసి ఇరికిస్తారు.. దాంతో తన తండ్రిని ఎలాగైనా కేసు నుంచి బయట పడేయాలంటూ అతడి కూతురు (మేఘా ఆకాష్) రవీంద్ర దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత అదే కేసును మరో రెండు నెలల్లో రిటైర్ అవ్వబోయే సిన్సియర్ ఆఫీసర్ అసిస్టెంట్ కమిషనర్ (జయరాం) కు హ్యాండిల్ చేస్తారు. ఆ హత్య చేసింది రవీంద్రే అని తెలుసుకుంటాడు కమీషనర్. కానీ సాక్ష్యాలు మాత్రం ఉండవు. అసలు ఈ హత్యలన్నీ రవీంద్ర ఎందుకు చేస్తున్నాడు..? దానికి సాకేత్ (సుశాంత్) ఎందుకు సాయం చేసాడు..? అసలు రవీంద్ర జీవితంలోకి సాకేత్ ఎందుకు వచ్చాడు అనేది అసలు కథ..

కథనం:

హీరో నెగిటివ్ షేడ్ చేస్తే ఆ సినిమాపై క్యూరియాసిటీ పెరుగుతుంది. బహుశా రావణాసుర కోసం సుధీర్ వర్మ అప్లై చేసిన ఫార్ములా ఇదే. రవితేజను నెగిటివ్ రోల్ లో చూపిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన నుంచే.. ఈ రావణాసుర కథ పుట్టి ఉంటుంది. పైగా ఇది బెంగాలి సినిమా విన్సిడాకు రీమేక్ అనే ప్రచారం ముందు నుంచి జరుగుతుంది. కానీ దీన్ని దర్శక నిర్మాతలు మాత్రం ఒప్పుకోలేదు. కానీ సినిమా చూసాక అది ఇదే అనే కన్ఫర్మేషన్ వచ్చింది. చిన్న చిన్న మార్పులతో బెంగాలీ సినిమాను రీమేక్ చేసారు మేకర్స్. కానీ ఇందులో సగం వరకే సక్సెస్ అయ్యాడు సుధీర్ వర్మ. ఫస్టాఫ్ అంత సక్సెస్ ఫుల్ విలన్ గా చూపించినా.. కీలకమైన సెకండాఫ్ లో మాత్రం రావణాసుర అంతగా ఆకట్టుకోలేదు. మరీ ముఖ్యంగా మెయిన్ ట్విస్ట్ రివిల్ అయిన తర్వాత.. రొటీన్ రివెంజ్ ఫార్ములాగా మారిపోయాడు రావణాసురుడు. ఇదేం కొత్త కథ కాదు.. కాకపోతే ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉండాలి. సరిగ్గా ఇక్కడే సుధీర్ వర్మ అనుకున్నంత సక్సెస్ కాలేదు. చాలావరకు సస్పెన్స్ మెయిన్టేన్ చేసినా.. ప్రీ క్లైమాక్స్ తర్వాత రావణాసురపై అభిప్రాయం మారిపోతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా కథ కంటే ఎక్కువగా కామెడీ మీదే ఫోకస్ చేసాడు దర్శకుడు. హైపర్ ఆదితో రవితేజ కామెడీ ట్రాక్ బాగానే అనిపిస్తుంది. అయితే కీలకమైన కథలోకి వెళ్లిన తర్వాత ఆదిని పూర్తిగా పక్కనబెట్టారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయినా.. సెకండాఫ్ మాత్రం అంచనాలకు తగ్గట్లుగా లేదు. ట్విస్టులు మరీ ఎక్కువైపోవడం కూడా రావణాసురకు మైనస్ అయింది. రవితేజ ఎందుకు అలా అందర్నీ చంపేస్తున్నాడు.. అమ్మాయిలతోనూ ఎందుకంతగా క్రూరంగా ఉంటున్నాడనే దానికి వివరణ లేదు. జస్ట్ బిల్డప్ షాట్స్ కోసమే వాటిని షూట్ చేసారని అర్థమవుతుంది.

నటీనటులు:

రవితేజ కొత్తగా ఉన్నాడు.. నెగిటివ్ షేడ్ అదరగొట్టాడు. చివర్లో ఎలాగూ ట్విస్ట్ ఉంటుంది కాబట్టి ఉన్నంత వరకు మాత్రం చంపేసాడంతే. సుశాంత్ కు మంచి పాత్ర పడింది.. కథలో చాలా కీలకమైన కారెక్టర్ ఇది. దాన్ని బాగానే పోషించాడు సుశాంత్. ఐదుగురు హీరోయిన్లు కథలో కలిసిపోయారు. మేఘా ఆకాశ్ అందరిలోనూ బాగా చేసింది. ఫరియా అబ్దుల్లా మరోసారి జాతి రత్నాలు టైప్ ఆఫ్ కారెక్టర్ చేసింది. పూజిత పొన్నాడ, దక్ష, అను ఇమ్మాన్యుయేల్ ఉన్నంతలో బాగానే చేసారు. జయరాం పాత్ర ఓకే. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం పర్లేదు. పాటలు బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ జస్ట్ ఓకే. సెకండాఫ్ కాస్త కత్తెర పడాల్సి ఉంది. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. కథ పరంగా శ్రీకాంత్ విస్సా గొప్పగా ఏం లేదు. పైగా బెంగాలీ రీమేక్ కథను మనకు తగ్గట్లుగా మార్చాడు. దర్శకుడిగా సుధీర్ వర్మ సగం వరకే సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడుంటే రావణాసుర కచ్చితంగా మంచి సినిమా అయ్యుండేది.

పంచ్ లైన్:

రావణాసుర.. ఫస్టాఫ్ ఓకే.. సెకండాఫ్ నిల్..