AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hrithik Roshan: ఎంతవారలైన కాంతదాసులే అని ఊరికే అన్నారా ? .. ఈ హీరో చేసిన పని అలాగే ఉందట మరి..

గత కొద్ది రోజులుగా హృతిక్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 2014లో తన భార్య సుసానే ఖాన్‏తో విడాకులు తీసకున్న హృతిక్.. కొద్ది రోజులుగా ఒంటరిగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత సింగర్ సబా ఆజాద్‏తో ఆయనకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.

Hrithik Roshan: ఎంతవారలైన కాంతదాసులే అని ఊరికే అన్నారా ? .. ఈ హీరో చేసిన పని అలాగే ఉందట మరి..
Hrithik
Rajitha Chanti
|

Updated on: Apr 05, 2023 | 8:02 AM

Share

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‏కు ఉండే పాలోయింగ్ గురించి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో ఈ హీరోకు అభిమానులు ఉన్నారు. కానీ గత కొద్ది రోజులుగా హృతిక్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 2014లో తన భార్య సుసానే ఖాన్‏తో విడాకులు తీసకున్న హృతిక్.. కొద్ది రోజులుగా ఒంటరిగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత సింగర్ సబా ఆజాద్‏తో ఆయనకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు కలిసి ఇటీవల పలు ఈవెంట్లలో సందడి చేస్తున్నారు. వీరిద్దరి రిలేషన్ షిప్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ వీరి ప్రేమ గురించి రూమర్స్ మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇటీవల ముంబయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సావానికి తన ప్రియురాలితో కలిసి పాల్గొన్నారు హృతిక్. అయితే ఆ వేడుకల్లో హృతిక్ చేసిన పనికి నెటిజన్స్ షాకవుతున్నారు.

తాజాగా ముంబైలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అఏమిత్ అగర్వాల్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఇందులో అమిత్, సబాతో ఫోటో దిగుతుండగా.. వెనకాలే హృతిక్ చేతిలో హీల్స్ పట్టుకుని కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది. తన ప్రియురాలు సబా హీల్స్ ను హృతిక్ పట్టుకుని కనిపించడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం లవర్ పై ప్రేమ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎప్పటిలాగే హృతిక్ ఫ్యాన్స్ మాత్రం.. ఆయన సింప్లిసిటీకి మెచ్చుకోవాలంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల ఈ జంట ముంబైలోని జుహు ప్రాంతంలో దాదాపు రూ. 100 కోట్ల విలువైన రెండు ప్లాట్లను కొనుగోలు చేసినట్లుగా వార్తలొచ్చాయి. ఇటీవల హృతిక్ ఫ్యామిలీతో గెట్ టుగెదర్, కరణ్ జోహార్ బర్త్ డే వేడుకలో జంటగా కనిపించి తమ ప్రేమను కొనసాగిస్తున్నారు.. ప్రస్తుతం హృతిక్ ఫైటర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు