Jr.NTR: బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న తారక్.. ఆ స్టార్ హీరోతో యుద్ధం చేయనున్న ఎన్టీఆర్..
తాజాగా మరో బిగ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేసి నందమూరి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటివరకు తెలుగు చిత్రపరిశ్రమలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న తారక్.. ఇప్పుడు హిందీలోకి అడుగుపెడుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు.. ఓ స్టార్ హీరోతో తారక్ యుద్ధం ఉండబోతుంది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత తారక్ చేయబోయే సినిమా కోసం ఇటు ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో NTR30 సినిమా చేస్తున్నారు తారక్. ఇటీవలే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాగా.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమాకు సంబందించిన వరుస అప్డేట్స్ షేర్ చేస్తూ.. ఓవైపు తారక్ అభిమానులను ఖుషి చేస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా మరో బిగ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేసి నందమూరి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటివరకు తెలుగు చిత్రపరిశ్రమలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న తారక్.. ఇప్పుడు హిందీలోకి అడుగుపెడుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు.. ఓ స్టార్ హీరోతో తారక్ యుద్ధం ఉండబోతుంది.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం వార్. 2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నామని యశ్ రాజ్ ఫిలింస్ ప్రకటించింది. కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. చివరగా.. వార్ 2కు స్టేజీ ఇప్పుడు సెట్ అయ్యింది. వార్ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా.. వార్ 2కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నారు. ఇక ఇందులో హృతిక్ తో కలిసి యంగ్ టైగర్ స్క్రీన్ షేర్ చేసుకుబోతున్నారని.. బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.




ప్రస్తుతం ఈ వార్త అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. హృతిక్, ఎన్టీఆర్ కలయికలో వార్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం తారక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా చేస్తున్నారు.
IT’S OFFICIAL… HRITHIK – JR NTR IN ‘WAR 2’… #YRF pulls off a casting coup… #HrithikRoshan and #JrNTR will share screen space for the first time in #War2… #AyanMukerji directs. #YRFSpyUniverse pic.twitter.com/rGu8Z3Nzs7
— taran adarsh (@taran_adarsh) April 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




