AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: ఆ ఎనర్జీ ఏంటమ్మ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న కీర్తి సురేష్ మాస్ డ్యాన్స్..

శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. భారీగానే వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమాకు యూత్‏కు బాగా కనెక్ట్ అయ్యింది. అంతేకాకుండా.. నాని లోకల్ తర్వాత కీర్తి, నాని కాంబోలో వచ్చిన సెకండ్ సినిమా ఇది

Keerthy Suresh: ఆ ఎనర్జీ ఏంటమ్మ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న కీర్తి సురేష్ మాస్ డ్యాన్స్..
Keerthy Suresh
Rajitha Chanti
|

Updated on: Apr 05, 2023 | 7:27 AM

Share

రెండవ సినిమాతోనే ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. మహానటి సినిమాలో ఆమె నటన అద్భుతం. అలనాటి హీరోయిన్ సావిత్రిని మైమరపించింది. ఇక ఆ తర్వాత తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. గతేడాది సర్కారు వారి పాట సినిమాతో విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల దసరా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రూపొందించిన లేటేస్ట్ చిత్రం దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురష్ నటించగా.. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలకపాత్రలో నటించారు. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. భారీగానే వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమాకు యూత్‏కు బాగా కనెక్ట్ అయ్యింది. అంతేకాకుండా.. నాని లోకల్ తర్వాత కీర్తి, నాని కాంబోలో వచ్చిన సెకండ్ సినిమా ఇది.

ఈ సినిమాలో నాని మాస్ లుక్ తో ధరణి పాత్రలో నటించగా.. గ్రామీణ యువతి వెన్నెల పాత్రలో కనిపించింది కీర్తి. ఈ సినిమాలో ఆమె పోషించిన వెన్నెల పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా ఆమె పాత్ర ఈ సినిమాకు హైలెట్ అయ్యింది. ఈ సినిమాలో పెళ్లి కూతురుగా కీర్తి సురేష్ బ్యాండు మేళం ముందు మాస్ డ్యాన్స్ చేస్తుంది. చూడటానికి ఇది చిన్న బిట్ మాదిరిగానే అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలోనే కీర్తి సురేష్ మాస్ డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది. థియేటర్లలో ఆమె మాస్ డాన్స్ తో ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తుంది. ఇప్పటికే కీర్తి మాస్ డ్యాన్స్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

తాజాగా కీర్తి సురేష్ మాస్ డ్యాన్స్ వీడియోను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. అందులో బ్యాండు మేళం ముందు కీర్తి పక్కా మాస్ డాన్స్ తో అదిరగొట్టింది. విడుదలైన క్షణాల్లోనే నెట్టింట వైరలయ్యింది కీర్తి. దీంతో ఆ ఎనర్జీ ఏంటమ్మ కీర్తి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..