NTR 30: ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో విలన్‏గా సైఫ్ అలీ ఖాన్ ?.. క్లారిటీ ఇదే..

ఎన్టీఆర్ 30 ప్రాజెక్టుతో సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెడుతుంది జాన్వీ కపూర్. కేవలం కథానాయికలు మాత్రమే కాదు.. స్టార్ హీరోస్ సైతం తెలుగులో సినిమాలు చేసేందుకు సై అంటున్నారు. పాత్రతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రభాస్, డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న ఆదిపురుష్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే.

NTR 30: ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో విలన్‏గా సైఫ్ అలీ ఖాన్ ?.. క్లారిటీ ఇదే..
NTR 30
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 05, 2023 | 7:09 AM

ప్రస్తుతం బాలీవుడ్ తారల చూపు సౌత్ ఇండస్ట్రీపై పడింది. దక్షిణాదిలో సినిమాలు చేసేందుకు నార్త్ సెలబ్రెటీస్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో అలియా భట్, సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే ప్రాజెక్ట్ కె సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఎన్టీఆర్ 30 ప్రాజెక్టుతో సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెడుతుంది జాన్వీ కపూర్. కేవలం కథానాయికలు మాత్రమే కాదు.. స్టార్ హీరోస్ సైతం తెలుగులో సినిమాలు చేసేందుకు సై అంటున్నారు. పాత్రతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రభాస్, డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న ఆదిపురుష్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఆయనకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకుంది. ఇక ఎన్నో అంచనాలు నెలకొన్న ఎన్టీఆర్ 30లోనూ సైఫ్ విలన్ రోల్ చేయబోతున్నారంటూ గత కొంతకాలంగా టాక్ నడుస్తోంది. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో సైఫ్ రోల్ మరింత పవర్ ఫుల్ గా ఉండబోతుందని ఫిల్మ్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆయన రోల్ పై స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తోంది.

నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. జాన్వీతోపాటు.. తారక్ సైతం సెట్ లో అడుగుపెట్టారు. అయితే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే..ఎన్టీఆర్ 30 సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందంటూ ప్రకాష్ రాజ్ మార్చి 23న ట్వీట్ చేశారు. అయితే ఆయన విలన్ పాత్రలో కనిపించనున్నారా ? లేదా మరేదైనా కీలకపాత్రలో కనిపించబోతున్నారా ? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమాకు సైఫ్ నో చెప్పారని టాక్.

ఇవి కూడా చదవండి

మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. కెన్నీ బెట్స్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా.. బ్రాడ్ మిన్నిచ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నారు. కళ్యాణ్ రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.