Khushbu Sundar: ఆసుపత్రిలో చేరిన ఖుష్బు.. వైరలవుతున్న ట్వీట్.. ఆందోళనలో అభిమానులు..

తాజాగా హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరినట్లు కొన్ని ఫోటోస్ రిలీజ్ చేసింది. తాను జ్వరం, శరీర నొప్పి, బలహీనతతో ఆసుపత్రిలో చేరినట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సంకేతాలను అయినా పట్టించుకోకుండా ఉండకండి అంటూ అభిమానులకు సూచించింది ఖుష్బు.

Khushbu Sundar: ఆసుపత్రిలో చేరిన ఖుష్బు.. వైరలవుతున్న ట్వీట్.. ఆందోళనలో అభిమానులు..
Khushbu Sundar
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 07, 2023 | 3:03 PM

దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఖుష్బు సుందర్. అప్పట్లో వరుస సూపర్ హిట్ చిత్రాలతో అగ్రకథానాయికగా కొనసాగిన ఆమె.. ఇప్పుడు సహయ నటిగా రాణిస్తోంది. ఓవైపు సినిమాల్లో పలు కీలకపాత్రలను పోషిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో కీలకసభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉండే ఆమె.. తాజాగా హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరినట్లు కొన్ని ఫోటోస్ రిలీజ్ చేసింది. తాను జ్వరం, శరీర నొప్పి, బలహీనతతో ఆసుపత్రిలో చేరినట్లు ట్విట్టర్ వేదికగా తెలియజేసింది ఖుష్బు. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సంకేతాలను అయినా పట్టించుకోకుండా ఉండకండి అంటూ అభిమానులకు సూచించింది ఖుష్బు.

ఏప్రిల్ 7న ఖుష్బ తీవ్ర జ్వరం, బలహీనతతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. “ఫ్లూ చాలా చెడ్డది. ఇది నా ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపింది. తీవ్రమైన జ్వరం, శరీర నొప్పి, బలహీనతతో అడ్మిట్ అయ్యాను. అదృష్టవశాత్తూ.. అపోలో వైద్యులు నాకు సహకరిస్తున్నారు. అనారోగ్యానికి గురైనట్లుగా లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి” అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల ఖుష్బు.. విజయ్ దళపతి.. రష్మిక మందన్నా కలిసి నటించిన వారిసు చిత్రంలో నటిస్తున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఆమెకు సంబంధించిన పోస్టర్స్ సైతం రిలీజ్ చేశారు. కానీ థియేటర్లలో సినిమా విడుదలయ్యాక ఎక్కడా ఖుష్బు కనిపించకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.