Jr.NTR: టాలీవుడ్ టూ బాలీవుడ్.. ‘వార్ 2’ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకునే రెమ్యునరేషన్ ఎంతంటే..

ఇందులో ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే తారక్ సెట్ లో అడుగుపెట్టిన వీడియో సినిమాపై హైప్ పెంచేయగా.. భయం అంటే తెలియని రాక్షసులని భయపెట్టే వీరుడి కథ అంటూ స్టోరీ లైన్ చెప్పేశారు కొరటాల శివ. దీంతో ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

Jr.NTR: టాలీవుడ్ టూ బాలీవుడ్.. 'వార్ 2' సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకునే రెమ్యునరేషన్ ఎంతంటే..
Jr.ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 07, 2023 | 2:44 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తారక్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇటీవలే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. అలాగే ఇందులో ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే తారక్ సెట్ లో అడుగుపెట్టిన వీడియో సినిమాపై హైప్ పెంచేయగా.. భయం అంటే తెలియని రాక్షసులని భయపెట్టే వీరుడి కథ అంటూ స్టోరీ లైన్ చెప్పేశారు కొరటాల శివ. దీంతో ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్‏తో చేయబోతున్న ఈ సినిమాను భారీగానే ప్లాన్ చేశారు డైరెక్టర్ కొరటాల శివ. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ సినిమాలో హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ పనిచేస్తున్నారు. అలాగే హాలీవుడ్ విఎఫ్ఎక్స్ నిపుణులను ఈ మూవీ కోసం తీసుకువస్తున్నారు. ఇక ఈ సినిమాతోపాటు.. తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారట. హృతిక్ రోషన్ నటిస్తోన్న వార్ 2 చిత్రంలో తారక్ కూడా నటించనున్నారని తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించబోతుంది. అయితే ఈ సినిమా కోసం తారక్ తీసుకోబోయే రెమ్యూనరేషన్ గురించి నెట్టింట ఆసక్తికర వార్త హల్చల్ చేస్తుంది. ఈ సినిమా కోసం తారక్ రూ. 30 కోట్ల రెమ్యూనరేషన్ ఆపర్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో తారక్ ఒకరు. అందుకే ఇంతమొత్తంలో యష్ రాజ్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివతో చేస్తోన్న సినిమా కోసం తారక్.. దాదాపు రూ. 80 నుంచి 100 కోట్ల మధ్య తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. విజయదశమి సందర్భంగా థియేటర్లలోకి రానుంది.