Tollywood: ‘అనితా.. ఓ అనిత’.. సాంగ్ సింగర్ నాగరాజు జీవితంలో ఇంత విషాదం దాగుందా ?..

దాదాపు 15 ఏళ్ల క్రితం ఈ పాట సంచలనం సృష్టించింది. చిన్నా, పెద్దా ఎక్కడా చూసిన ఈ సాంగ్ ఆలపించేవారు. ఇక అప్పట్లో ఎక్కడా విన్నా సినిమా పాటలకంటే ఎక్కువ ఈ సాంగ్ వినిపించేది. ఈ పాటే కాదు.. ఈ సాంగ్ వెనక దాగున్నా బ్రేకప్ స్టోరీ కూడా అప్పట్లో ఫేమస్. తన ప్రేయసితో విడిపోయిన ఓ వ్యక్తి మనోవేదనే ఈ సాంగ్. ఈ పాట రాసిన వ్యక్తి పేరు నాగరాజు.

Tollywood: 'అనితా.. ఓ అనిత'.. సాంగ్ సింగర్ నాగరాజు జీవితంలో ఇంత విషాదం దాగుందా ?..
Anitha O Anitha Song Singer
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 09, 2023 | 4:38 PM

‘అనితా.. ఓ అనిత.. నా అందమైన అనిత’.. ఒకప్పుడు ఈ పాట తెగ ఫేమస్. సోషల్ మీడియా లేని సమయంలోనే ఈ సాంగ్ సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఇప్పటి యువతకు అంతగా తెలియకపోయిన.. 90’s పిల్లలకు ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 15 ఏళ్ల క్రితం ఈ పాట సంచలనం సృష్టించింది. చిన్నా, పెద్దా ఎక్కడా చూసిన ఈ సాంగ్ ఆలపించేవారు. ఇక అప్పట్లో ఎక్కడా విన్నా సినిమా పాటలకంటే ఎక్కువ ఈ సాంగ్ వినిపించేది. ఈ పాటే కాదు.. ఈ సాంగ్ వెనక దాగున్నా బ్రేకప్ స్టోరీ కూడా అప్పట్లో ఫేమస్. తన ప్రేయసితో విడిపోయిన ఓ వ్యక్తి మనోవేదనే ఈ సాంగ్. ఈ పాట రాసిన వ్యక్తి పేరు నాగరాజు. తన ప్రేమకథ.. బ్రేకప్ బాధను పాట రూపంలో అందరి ముందుకు తీసుకువచ్చాడు నాగరాజు. ఈపాటతో అతను కూడా అప్పట్లో చాలా పాపులర్ అయ్యాడు.

అయితే ఈ సాంగ్ తర్వాత అతని పేరు మరెక్కడా వినిపించలేదు. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చాడు. ఇటీవల ఓ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చాడు నాగరాజు. తన ప్రేమ.. బ్రేకప్ నుంచి… పెళ్లి.. పిల్లలు జీవితం.. ఇలా అన్నింటి గురించి చెబుతు కంటతడి పెట్టుకున్నాడు. తాను అనిత అనే అమ్మాయిని ప్రేమించానని.. కానీ తమ పెళ్లికి అమ్మాయి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో విడిపోయామని.. ఆ బాధతోనే అనిత సాంగ్ రాసినట్లు చెప్పారు. ఈ పాట రాసేందుకు దాదాపు నెల రోజులు కష్టపడ్డానని.. అంతకు ముందు ఆర్కేస్ట్రాలో సింగర్ గా పనిచేశానని అన్నారు. తన తొలి సాంగ్ అనిత పాటను తానే స్వయంగా పాడినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

బ్రేకప్ తర్వాత తనకు మరో అమ్మాయితో పెళ్ళి అయ్యిందని.. మంచి అమ్మాయి భార్యగా వచ్చిందని.. తన పేరు దేవిక అని తెలిపారు. నాగరాజు..దేవిక దంపతులకు ఇద్దరు అబ్బాయిలు కాగా.. పెద్దాబ్బాయికి మూగ.. చెవుడు.. పెద్దాబ్బాయితో ఉండి చిన్నబ్బాయి కూడా సైగలు చేస్తున్నాడని అన్నారు నాగరాజు. కొంత కాలం పాన్ షాప్ తో కుటుంబాన్ని పోషించానని.. కళామతల్లి కాపాడుతుందనే నమ్మకంతో మళ్లీ హైదరాబాద్ షిప్ట్ అయ్యామని తెలిపారు. త్వరలోనే అనిత 2 సాంగ్ రాబోతుందని చెప్పారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?