బికినీ వేసుకున్నట్లు నా ఫొటోలను మార్ఫింగ్ చేశారు.. చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న నివేతా

తమిళ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైంది అందాల తార నివేతా పేతురాజ్‌. అనంతరం రెండో సినిమా మెంటల్‌ మదిలో మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ చిన్నది. తనదైన అందం నటనతో కుర్రకారును కట్టిపడేసిన చిన్నది తాజాగా విశ్వక్‌ సేన్‌తో దాస్‌ కా దమ్కీ మూవీలో నటించి మరో విజయాన్ని...

బికినీ వేసుకున్నట్లు నా ఫొటోలను మార్ఫింగ్ చేశారు.. చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న నివేతా
Nivetha
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 09, 2023 | 4:28 PM

తమిళ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైంది అందాల తార నివేతా పేతురాజ్‌. అనంతరం రెండో సినిమా మెంటల్‌ మదిలో మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ చిన్నది. తనదైన అందం నటనతో కుర్రకారును కట్టిపడేసిన చిన్నది తాజాగా విశ్వక్‌ సేన్‌తో దాస్‌ కా దమ్కీ మూవీలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మీడియాతో ముచ్చటించిన ఈ చిన్నది పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన ఫొటోలను బికినీ వేసుకున్నట్లు మార్ఫింగ్ చేశారని గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది.

గ్లామర్‌ పాత్రలకు తనదైన డెఫినేషన్‌ ఇచ్చిందీ చిన్నది. చాలా మంది గ్లామర్‌ పాత్ర అనగానే స్కిన్‌ షో అనుకుంటారని, కానీ ఆ అభిప్రాయం మారాలన్నారు. కలకాలం మనకు గుర్తిండిపోయేదే అలసైన గ్లామర్‌ పాత్ర అని, అర్థనగ్నంగా కనిపించడమో, మరోలా పోజులివ్వడమో కానే కాదని చెప్పుకొచ్చిందీ చిన్నది. ఆస్ట్రోనాట్‌ కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టిందీ చిన్నది. అయితే ఆ కల ఎప్పటికి తీరుతుందో! ఏ దర్శకుడు ముందుకొస్తాడో అని చెప్పుకొచ్చింది. ఇప్పటికైతే ప్రయాణం సాఫీగా, సంతోషంగా సాగిపోందని అవకాశాలు బాగానే వస్తున్నాయంది. ఇతరులతో పోల్చుకోవడం కంటే.. వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే ఇగోలు, గొడవలు ఉండవనేది తన ఫిలాసఫి అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

ఇక మహిళలపై సోషల్‌ మీడియాలో విచ్చలవిడిగా ప్రవర్తించే వారికి గట్టిగా బుద్ధిచెప్పాలన్న నివేతా.. గతంలో తన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి బికినీ వేసుకున్నట్టుగా వైరల్‌ చేశారని వాపోయింది. అలాంటివాళ్లను చూస్తే ఒళ్లు మండుతుందని, వారికి ఉన్నట్టే మిగతావారికి కూడా కుటుంబం ఉంటుంది. వాళ్లు బాధపడతారనే ఇంగిత జ్ఞానం ఉండదా?అని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..