Kushi Movie: సమంత.. విజయ్‏ల సినిమాకు ‘ఖుషి’ అని పేరు పెట్టాడానికి కారణమదే.. డైరెక్టర్ శివ ఆసక్తికర కామెంట్స్..

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి.. నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శివ..ఇప్పుడు మరోసారి ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఈ సినిమాకు ఖుషి అని టైటిల్ పెట్టడానికిగల కారణాలను తెలియజేశారు.

Kushi Movie: సమంత.. విజయ్‏ల సినిమాకు 'ఖుషి' అని పేరు పెట్టాడానికి కారణమదే.. డైరెక్టర్ శివ ఆసక్తికర కామెంట్స్..
Shiva Nirvana
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 09, 2023 | 2:47 PM

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ మూవీతోపాటు.. సామ్ నటిస్తోన్న మరో చిత్రం ఖుషి. డైరక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి.. నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శివ..ఇప్పుడు మరోసారి ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఈ సినిమాకు ఖుషి అని టైటిల్ పెట్టడానికిగల కారణాలను తెలియజేశారు.

ఖుషి సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని అన్నారు. సమంత మయోసైటిస్ సమస్య నుంచి కోలుకోవడం కోసం నాలుగు నెలుల షూటింగ్ వాయిదా వేశామని.. ఇటీవల కశ్మీర్ లో 30 రోజుల షెడ్యూల్‏ను పూర్తిచేశామని అన్నారు. “హైదరాబాద్ లోనూ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం.. మజిలీ సమయంలో సమంతతో కలిసి పనిచేశాను.. ఖుషి కథ రాయగానే నా మనసులోకి వచ్చిన తొలి ఆలోచన సమంతనే అని.. ఆమె అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలదని అనిపించిందని.. అందుకు తనను ఎంపిక చేశాను. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో తన పాత్రకు జీవం పోశాడు. ఖుషిలో సమంత.. విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటుంది ” అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే.. ఖుషి చిత్రంలో హాస్యం, భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంటాయని… గతంలో విడుదలైన పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రంలాగే ఫీల్ గుడ్ మూవీగా ఎంతో ప్రేక్షకాధరణ పొందింది.. ఈ సినిమా కూడా అంతే ఫీల్ ఉంటుందని.. అందుకే ఈసినిమాకు ఖుషి అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు చెప్పారు డైరెక్టర్ శివ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.