AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంలో అప్సరస.. భర్త చేతిలో టార్చర్.. కట్ చేస్తే కోట్ల ఆస్తిని రాసిచ్చిన హీరోయిన్…

సినీరంగుల ప్రపంచంలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో వెండితెరపై ప్రేక్షకులను అలరించింది. అతి తక్కువ సమయంలోనే నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ప్రేమ, పెళ్లి ఆమె జీవితాన్ని తారుమారు చేశాయి. స్టార్ హీరోను ప్రాణంగా ప్రేమించింది.

అందంలో అప్సరస.. భర్త చేతిలో టార్చర్.. కట్ చేస్తే కోట్ల ఆస్తిని రాసిచ్చిన హీరోయిన్...
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 09, 2026 | 11:38 AM

Share

ఆమె  ఓ అందాల తార. సినిమా ఇండస్ట్రీలో తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ అందాల తార చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తమిళంతోపాటు తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఓ స్టార్ హీరోతో లవ్ లో పడింది. కానీ తమ ప్రేమకు తల్లి అడ్డు చెప్పడంతో వీరి బంధం పెళ్లి వరకు వెళ్ళలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న భర్త చేతిలో దారుణంగా మోసపోయింది. దీంతో కొన్నాళ్లకే అతడితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత క్యాన్సర్ తో పోరాడింది. చివరకు మరణించే ముందు కోట్ల ఆస్తులను పేద విద్యార్థులకు దానం చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే సీనియర్ హీరో శ్రీవిధ్య. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీతో సహా అనేక భాషా చిత్రాలలో నటించింది.

ఒకప్పుడు ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్. శ్రీవిద్య 1953లో చెన్నైలో జన్మించింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఇండస్ట్రీకి చెందినవారే. కానీ కుటుంబంలోని ఆర్థిక సమస్యతో చదువును మధ్యలోనే ఆపేసి సినీరంగంలోకి అడుగుపెట్టింది. 14 సంవత్సరాల వయస్సులో 1966లో శివాజీ నటించిన ‘తిరువరుత్సల్వర్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 1969లో ‘చతురంగం’ చిత్రంతో హీరోయిన్ గా మారింది శ్రీవిధ్య. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు జోడిగా కనిపించి మెప్పించింది. తెలుగుతోపాటు వివిధ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే కమల్ హాసన్ తో ప్రేమలో పడింది. వీరిద్దరు కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్నారు. అయితే వీరి పెళ్ళికి శ్రీవిధ్య తల్లి ఒప్పుకోలేదు. దీంతో కమల్ హాసన్, శ్రీవిధ్య ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆమె చిత్ర సహయ దర్శకుడు జార్జ్ థామస్ ను వివాహం చేసుకుంది. కానీ ఆమె వైవాహిక జీవితం అంత సంతోషంగా సాగలేదు.

తన భర్త కోసం క్రైస్తవ మతంలోకి మారిపోయింది శ్రీవిధ్య. అలాగే సినిమాలకు సైతం దూరంగా ఉండిపోయింది. కానీ ఆమెను నటించాలని.. డబ్బు సంపాదించాలని భర్త నిత్యం టార్చర్ చేశారట. అలాగే ఆమెకు మూడుసార్లు అబార్షన్ కూడా చేయించుకోవాలని వేధించారట. అతని వేధింపులు భరించలేక 1980లో విడాకులు తీసుకుంది శ్రీవిద్య. విడాకుల తర్వాత తిరిగి సినిమాల్లోకి వచ్చింది. ఆతర్వాత ఎన్నో సినిమాలో నటించింది 2003లో ఆమెకు వెన్నెముక క్యాన్సర్ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. దీంతో కొన్నాళ్లపాటు అనారోగ్య సమస్యలతో బాధపడింది. అదే సమయంలో తన ఆస్తులను పేద విద్యార్థులకు ఇస్తున్నట్లు వీలునామా రాసింది. 2006లో 53 సంవత్సరాల వయసులో శ్రీవిద్య కన్నుమూసింది.

ఇవి కూడా చదవండి

Actress Srividya

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us