Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. సినిమాల్లోకి అఖిరా నందన్.. ఫస్ట్ మూవీ అప్డేట్‌ కూడా వచ్చేసింది

తల్లి రేణూదేశాయ్‌ మాత్రం అఖిరా సినిమాల్లోకి రాడంటూ పలు సార్లు చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం అకిరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడన్న విషయం అధికారికంగా ఖరారైంది. ఇందుకు సంబంధించి అప్డేట్‌ కూడా వచ్చేసింది. అయితే ఇది గుడ్ న్యూస్‌ అయినా..

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. సినిమాల్లోకి అఖిరా నందన్.. ఫస్ట్ మూవీ అప్డేట్‌ కూడా వచ్చేసింది
Pawan Kalyan, Akira Nandan
Follow us
Basha Shek

|

Updated on: Apr 13, 2023 | 1:16 PM

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కుమారుడు అఖిరా నందన్‌ సినిమా ఇండస్ట్రీలోకి వస్తాడని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లే పవన్‌ లాగే చిన్నప్పుడే మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా నేర్చుకున్నాడు. అలాగే మ్యూజిక్‌పై కూడా పట్టుపెంచుకున్నాడు. అయితే తల్లి రేణూదేశాయ్‌ మాత్రం అఖిరా సినిమాల్లోకి రాడంటూ పలు సార్లు చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం అకిరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడన్న విషయం అధికారికంగా ఖరారైంది. ఇందుకు సంబంధించి అప్డేట్‌ కూడా వచ్చేసింది. అయితే ఇది గుడ్ న్యూస్‌ అయినా.. మెగా అభిమానులకు మాత్రం కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిల్వర్‌ స్ర్కీన్‌పై అకిరాను హీరోగా చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్‌. అయితే ఇప్పుడు మాత్రం అతను హీరోగా ఎంట్రీ ఇవ్వడం లేదు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తొలిసారి తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ‘రైటర్స్ బ్లాక్‌’ అనే ఒక షార్ట్ ఫిల్మ్ కి పవన్‌ కుమారుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.

తాజాగా ఈ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్‌. రైటర్స్ బ్లాక్‌ నుంచి ఒక రచయిత ఎలా తప్పించుకున్నాడు.. అనే కాన్సెప్ట్ తో ఈ షార్ట్ ఫిల్మ్‌ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కార్తికేయ యార్లగడ్డ రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. అకిరా నందన్ స్వరాలు సమకూర్చనున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మార్షల్‌ ఆర్ట్స్‌తో పాటు మ్యూజిక్‌లోనూ ఆరితేరిన అకీరా గతంలో ఒకసారి కీ బోర్డ్‌ ప్లే చేస్తూ పాట పాడిన సంగతి తెలిసిందే. ఈ వీడియో మెగా అభిమానులను బాగా ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!