AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం Vs బ్యాంక్ FD: సామాన్యులకు ఏది బెస్ట్.? డబ్బు డబుల్ చేసే సత్తా ఎందులో ఉందంటే..!

Gold vs Bank FD: ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా.. ఏ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినా.. దాని ప్రభావం నేరుగా మీ జేబుపై పడుతుందని మీకు తెలుసా? గ్లోబల్ మార్కెట్లు కుదేలైనప్పుడు ఇన్వెస్టర్లందరికీ కనిపించే ఒకే ఒక్క సురక్షిత తీరం బంగారం. అయితే మనలో చాలా మందికి ఇప్పటికీ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడమే మంచిదని అనుకుంటారు. ఈ రెండిటి మధ్య తేడాలు తెలుసుకుందాం..

బంగారం Vs బ్యాంక్ FD: సామాన్యులకు ఏది బెస్ట్.? డబ్బు డబుల్ చేసే సత్తా ఎందులో ఉందంటే..!
Gold Vs Bank Fixed Deposit
Krishna S
|

Updated on: Feb 26, 2026 | 4:46 PM

Share

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా, మార్కెట్లు కుప్పకూలుతుంటాయి. కానీ అలాంటి సమయంలోనూ ఎదురులేకుండా దూసుకుపోయేది కేవలం బంగారం మాత్రమే. అందుకే యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, ఆర్థిక సంక్షోభం వచ్చినా ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని నమ్ముకుంటారు. మరి ఈ తరుణంలో సామాన్యులు తమ పొదుపు మొత్తాన్ని గోల్డ్‌లో పెట్టాలా? లేక సాంప్రదాయ బ్యాంక్ FD లలో ఉంచాలా? ఏది సురక్షితమో ఇప్పుడు తెలుసుకుందాం..

కాలంతో పాటు మారుతున్న పెట్టుబడి పద్ధతులు

ఒకప్పుడు సామాన్యులకు పెట్టుబడి అంటే కేవలం బ్యాంక్ FDలు లేదా పోస్ట్ ఆఫీస్ పథకాలు మాత్రమే. కానీ ఇప్పుడు కాలం మారింది. నేటి ఇన్వెస్టర్లు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లతో పాటు బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో దీనిపై ఆసక్తి పెరుగుతోంది.

బంగారం

బంగారం ఎప్పుడూ స్థిరమైన రాబడిని ఇస్తుందని చెప్పలేం కానీ దీర్ఘకాలంలో ఇది భారీ లాభాలను అందిస్తుంది. కరెన్సీ విలువ తగ్గుతున్నప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. అత్యవసర సమయంలో బంగారాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా నగదుగా మార్చుకోవచ్చు.

బ్యాంక్ FD..

చాలా మంది భారతీయులు ఇప్పటికీ బ్యాంక్ FDనే అత్యంత సురక్షితమైనదిగా భావిస్తారు. ఇందులో మీరు పెట్టిన పెట్టుబడికి 7 రోజుల నుండి 10 ఏళ్ల వరకు నిర్ణీత కాల వ్యవధిలో గ్యారెంటీ వడ్డీ లభిస్తుంది. మీ బ్యాంక్ ఏదైనా కారణం వల్ల దివాలా తీస్తే.. భారత ప్రభుత్వం కేవలం రూ.5 లక్షల వరకు మాత్రమే బీమా కవరేజీ ఇస్తుంది. అంటే మీరు బ్యాంకులో రూ.50 లక్షలు డిపాజిట్ చేసినా, బ్యాంక్ మునిగిపోతే మీకు వచ్చేది కేవలం రూ.5 లక్షలు మాత్రమే.

ఏది బెస్ట్..?

తక్కువ రిస్క్ తో గ్యారెంటీ రాబడి కావాలనుకుంటే బ్యాంక్ FD మేలు. దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెట్టేవారికి బంగారం అత్యుత్తమ ఎంపిక.

Follow Us
బంగారం Vs బ్యాంక్ FD: సామాన్యులకు ఏది బెస్ట్.? డబ్బు డబుల్ చేసే..
బంగారం Vs బ్యాంక్ FD: సామాన్యులకు ఏది బెస్ట్.? డబ్బు డబుల్ చేసే..
రోజూ ఆపిల్ ఇలా వాడండి .. చర్మం ముత్యంలా మెరిసిపోతుంది!
రోజూ ఆపిల్ ఇలా వాడండి .. చర్మం ముత్యంలా మెరిసిపోతుంది!
Video: సౌతాఫ్రికా, విండీస్ మ్యాచ్‌లో మాటల యుద్ధం..
Video: సౌతాఫ్రికా, విండీస్ మ్యాచ్‌లో మాటల యుద్ధం..
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు భారీగా తగ్గింపు.. మార్చి 1 నుంచి అమలు
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు భారీగా తగ్గింపు.. మార్చి 1 నుంచి అమలు
రొటీన్ చపాతీలు బోర్ కొట్టాయా? ఒక్కసారి ఈ మసాలా రోటి" ట్రై చేయండి
రొటీన్ చపాతీలు బోర్ కొట్టాయా? ఒక్కసారి ఈ మసాలా రోటి
కొడవ సంప్రదాయంలో రష్మిక విజయ్ పెళ్లి.. వీడియో వైరల్..
కొడవ సంప్రదాయంలో రష్మిక విజయ్ పెళ్లి.. వీడియో వైరల్..
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే పాములన్నీ పరార్.. అటు వైపు రావడానికే..
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే పాములన్నీ పరార్.. అటు వైపు రావడానికే..
ప్రతీ ఇంటి డోర్‌కు క్యూఆర్ కోడ్.. క్షణాల్లోనే పేమెంట్
ప్రతీ ఇంటి డోర్‌కు క్యూఆర్ కోడ్.. క్షణాల్లోనే పేమెంట్
హోలీతో ఈ రాశులకు అదృష్టం.. మీకు ఏ రంగు బెస్ట్ అవుతుందో తెలుసా..?
హోలీతో ఈ రాశులకు అదృష్టం.. మీకు ఏ రంగు బెస్ట్ అవుతుందో తెలుసా..?
టాలీవుడ్‌లో నవశకం.. కంటెంట్‌తో కదం తొక్కుతున్న యువ నిర్మాతలు..!
టాలీవుడ్‌లో నవశకం.. కంటెంట్‌తో కదం తొక్కుతున్న యువ నిర్మాతలు..!