U Turn Movie: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘యూటర్న్’.. రీమేక్‌లో సమంతను మించిపోయినా హీరోయిన్..
ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా సమంత నటనకు ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో సెలబ్రెటీ కిడ్ ఆలయ ఎఫ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరియర్లో హిట్ అందుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో యూటర్న్ ఒకటి. 2017లో తెలుగుతోపాటు.. తమిళంలోనూ విడుదలైన ఈ సినిమాలో సామ్ కథానాయకగా నటించింది. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం తెలుగులో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా సమంత నటనకు ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో సామ్ పాత్రలో సెలబ్రెటీ కిడ్ ఆలయ ఎఫ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది ఆలయ. తన ఇన్ స్టాలో యు.. టర్న్ యు డై!.. మీరు ఊహించనిది ఏదైనా ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు మీరుగా ప్రమాదంలో పడే వీలుంది. నిబంధనలను ఉల్లంఘించండి. #UTurn.. ZEE5 లో ఏప్రిల్ 28న ప్రారంభమవుతుంది! అంటూ రాసుకొచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఆలయ ఎప్ ట్రాఫిక్ సేఫ్టీ సమస్యను పరిశోధించే జర్నలిస్టుగా కనిపించనుంది.
ఈ సినిమాకు రూకీ ఆరిఫ్ ఖాన్ దర్శకత్వం వహించగా.. ఏప్రిల్ 28న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ముందుగా శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ఈ చిత్రం 2018లో కన్నడలో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత సమంత మెయిన్ రోల్ పోషిస్తూ.. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఏకకాలంలో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఆలయ ప్రధాన పాత్రలో హిందీలో రీమేక్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.