Tollywood: ఒకప్పటి సెన్సెషనల్ హీరోయిన్.. చిరు. మోహన్ బాబులతో ఎన్నో సూపర్ హిట్స్.. ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టగలరా..

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున.. తమిళంలో రజినీకాంత్, కమల్ హసన్.. మలయాళంలో మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. చేతి నిండా చిత్రాలతో ఎప్పుడూ బిజీగా గడిపిన ఆమె...ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎవరో గుర్తుపట్టండి.

Tollywood: ఒకప్పటి సెన్సెషనల్ హీరోయిన్.. చిరు. మోహన్ బాబులతో ఎన్నో సూపర్ హిట్స్.. ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టగలరా..
Tollywood
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 13, 2023 | 8:25 AM

సినీతారలు.. సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాల్లో జరిగే విషయాలను తెలుసుకోవాలనుకుంటారు. ఇక అటు నటీనటులు కూడా తమ చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటుంటారు. గత కొద్ది రోజులుగా నెట్టింట సెలబ్రెటీస్ త్రోబ్యాక్ పిక్చర్స్ హల్చల్ చేస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ భాషలతో సంబంధం లేకుండా పలువురు హీరోహీరోయిన్స్ ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకప్పుడు వెండితెరపై సెన్సెషన్ క్రియేట్ చేసిన ఓ హీరోయిన్ చిన్ననాటి పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పైన ఫోటోలను చూశారు కదా.. 80-90s లలో అత్యంత ఎక్కువగా బిజీ ఉన్న హీరోయిన్. దక్షిణాదిలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున.. తమిళంలో రజినీకాంత్, కమల్ హసన్.. మలయాళంలో మమ్ముట్టి వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. చేతి నిండా చిత్రాలతో ఎప్పుడూ బిజీగా గడిపిన ఆమె…ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎవరో గుర్తుపట్టండి.

ఆ అమ్మాయి మరెవరో కాదు… అలనాటి అందాల తార శోభన. 1986లో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ సినిమాతె తెలుగు తెరకు పరిచయమైంది శోభన. ఈ సినిమా తర్వాత విజృంభణ, అజేయుడు, మువ్వగోపాలుడు, అభినందన, రుద్రవీణ, అల్లుడు గారు, రౌడీ గారి పెళ్లాం, రౌడీ అల్లుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగుతోపాటు.. మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది.

కేవలం నటిగానే కాదు.. నాట్యకారిణిగానూ తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. 1980లో భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో శోభన ఒకరు. అందంలోనూ నటనలోనే కాక నాట్యంలోనూ అద్భుతంగా రాణిస్తోంది. చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ తీసుకున్న ఆమె.. ఇప్పుడు ఎంతో మంది చిన్నారులకు నాట్యం నేర్పిస్తుంది. 1994లో కళార్పణ అనే సంస్థ ఏర్పాటు చేసింది. ఇందులో భారతనాట్యంలో శిక్షణ ఇస్తుంది. శోభన ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా నాట్యానికే తన జీవితాన్ని అంకితం చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.