- Telugu News Photo Gallery Cinema photos Junior NTR Hosts Special Dinner Party To Tollywood Celebrities And RRR Movie Team telugu cinema news
Jr.NTR: ఎన్టీఆర్ ఇంట్లో ఆర్ఆర్ఆర్ టీమ్ హైఫై డిన్నర్.. సందడి చేసిన రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ సందడి..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నివాసం ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి హైఫై విందు ఇచ్చారు. తారక్ ఇచ్చిన ఈ పార్టీకి రాజమౌళితోపాటు.. అతికొద్ది మంది సెలబ్రెటీలు విచ్చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Updated on: Apr 13, 2023 | 8:45 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నివాసం ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి హైఫై విందు ఇచ్చారు.

తారక్ ఇచ్చిన ఈ పార్టీకి రాజమౌళితోపాటు.. అతికొద్ది మంది సెలబ్రెటీలు విచ్చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

అయితే ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తప్ప మిగతా ట్రిపుల్ ఆర్ టీమ్ మొత్తం కనిపించింది. వీరితోపాటు.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి సందడి చేశారు.

ట్రిపుల్ ఆర్ సినిమా విజయం వెనక ఉన్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు తారక్. అలాగే ఈ పార్టీకి అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫార్వెల్ కూడా రావడం విశేషం.

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్తాయిలో భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డ్స్ అందుకుంది.

అలాగే ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఒరిజినల్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ అందుకుని చరిత్ర సృష్టించింది. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించారు.





























