Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మరో చిన్నారి ప్రాణం కాపాడిన మహేష్ బాబు.. సూపర్ స్టార్ మనసు బంగారం..

కొన్నేళ్లుగా ఆంధ్ర హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో గుండె సంబంధిత సమస్యలున్న చిన్నారులకు ఆపరేషన్స్ చేయించడమే కాదు.. వారికి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి ఖర్చులను ఆయనే చూసుకుంటూ వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇక ఇప్పుడు మరో ప్రాణాన్ని కాపాడారు.

Mahesh Babu: మరో చిన్నారి ప్రాణం కాపాడిన మహేష్ బాబు.. సూపర్ స్టార్ మనసు బంగారం..
Mahesh Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 13, 2023 | 7:04 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి మనసు గురించి చెప్పక్కర్లేదు. ఓవైపు సినిమాలు.. కమర్షియల్ యాడ్స్ అంటూ తెగ బిజీగా ఉంటూనే..మరోవైపు సామాజిక సేవలు చేయడంలోనూ ముందుంటారు. ఇప్పటికే తన పేరు మీద మహేష్ బాబు ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి లెజెండరీ కృష్ణ మాదిరిగానే మొదటి నుంచి తన ఆదాయంలో కొంత మొత్తాన్ని చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు వినియోగిస్తున్నారు. కొన్నేళ్లుగా ఆంధ్ర హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో గుండె సంబంధిత సమస్యలున్న చిన్నారులకు ఆపరేషన్స్ చేయించడమే కాదు.. వారికి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి ఖర్చులను ఆయనే చూసుకుంటూ వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇక ఇప్పుడు మరో ప్రాణాన్ని కాపాడారు మహేష్.

మహేష్ బాబు ఫౌండేషన్ తరపున శివాలి అనే రెండేళ్ల వయసున్న చిన్నారికి గుండె శస్త్ర చికిత్స జరిగింది. కాగా ఆ ఆపరేషన్ విజయవంతం కావడంతోపాటు.. ప్రస్తుతం ఆ చిన్నారి సంతోషంగా డిశ్చార్జి అయి ఇంటికి చేరుకుంది. తమ కూతురు ఆరోగ్యంగా తిరిగి ఇంటికి రావడంతో ఆ తల్లిదండ్రుల సంతోషం వెలకట్టలేనిది. తమ బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టేందుకు సహయపడిన సూపర్ స్టార్ మహేష్ బాబుకు శివాలి తల్లిదండ్రులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆ చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్న వీడియోను మహేష్ బాబు పౌండేషన్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా వైరలవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ మహేష్ బాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహేష్ .. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. చాలా కాలం తర్వాత త్రివిక్రమ్, మహేష్ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలోనూ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.