Keerthy Suresh: ఎంతైనా కీర్తి నువ్వు గ్రేట్ అంతే.. పక్కా తెలంగాణ యాసలో ఎంత సులువుగా డబ్బింగ్ చెప్పిందో చూశారా ?..

ఇప్పటివరకు థియేటర్లలో ప్రేక్షకుడికి కనిపించని వెన్నెల ఆవేదనను.. ఇలా క్లిప్ రూపంలో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ఇక తాజాగా ఆ వీడియోకు సంబంధించిన డబ్బింగ్ వీడియోను పంచుకున్నారు కీర్తి.

Keerthy Suresh: ఎంతైనా కీర్తి నువ్వు గ్రేట్ అంతే.. పక్కా తెలంగాణ యాసలో ఎంత సులువుగా డబ్బింగ్ చెప్పిందో చూశారా ?..
Keerthy Suresh
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 13, 2023 | 6:46 AM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దసరా హవా నడుస్తోంది. మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా అటు సోషల్ మీడియాలోనూ సెన్సెషన్ అవుతుంది. ఓవైపు మూవీ వచ్చి పది రోజులు దాటిన జోరు మాత్రం తగ్గడం లేదు.. మరోవైపు ఎక్కడ విన్నా చమ్మీల అంగిలేసి సాంగ్ ట్రెండ్ అవుతుంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాలో నాని పక్కా మాస్ క్యారెక్టర్‏లో అలరించగా.. గ్రామీణ యువతిగా కీర్తి మెప్పించింది. సినిమా మొత్తం పూర్తిగా తెలంగాణ యాసలో ఉండడంతో ఆడియన్స్ నుంచి మరింత రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ధరణి పాత్రలో నాని నటించగా.. వెన్నెలగా కీర్తి కనిపించింది. ఇటీవల విడుదల చేసిన డిలీటెడ్ సీన్ వెన్నెల ఆవేదన నెట్టింట హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు థియేటర్లలో ప్రేక్షకుడికి కనిపించని వెన్నెల ఆవేదనను.. ఇలా క్లిప్ రూపంలో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ఇక తాజాగా ఆ వీడియోకు సంబంధించిన డబ్బింగ్ వీడియోను పంచుకున్నారు కీర్తి.

పూర్తిగా తెలంగాణ యాసలో నాన్ స్టాప్ డైలాగ్ ను ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎంతో సులువుగా చెప్పేసింది. అంతేకాదు.. డబ్బింగ్ చెబుతూ.. కీర్తి తన పాత్రలో లీనమైపోయి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా మిగతా భాషల్లో అంతగా క్లిక్ అవ్వకపోయినా.. తెలుగులో మాత్రం మంచి వసూళ్లు రాబడుతుంది. వీడుదలైన పదిరోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక తాజాగా ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్ మార్క్ టచ్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీకాంత్ ఓదెల. తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ సినిమాకు ఆయన టేకింగ్ పై పొగడ్తలు కురిపించారు. ఇందులో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలకపాత్రలో నటించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.