Summer Movies: మండు వేసవిలో వినోదాల వాన.. సమ్మర్‌లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే
డిస్నిఫైడ్ శాకుంతలాన్ని చూడ్డానికి ప్రేక్షకులు ఈ వేసవిలో సిద్ధంగా ఉండండి అని శాకుంతలం సినిమాని ఇష్టంగా ప్రమోట్ చేస్తున్నారు సమంత. ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లలో ఇప్పటిదాకా తాను పోషించని పాత్రలో కనిపిస్తున్నారు సమంత.

ఫస్ట్ ఎక్స్ పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అంటారు. ఈ మండు వేసవిలో అలాంటి ఎక్స్ పీరియన్స ని టేస్ట్ చేస్తున్నారు కొందరు స్టార్స్. ఈ నెల్లో విడుదలవుతున్న శాకుంతలం నుంచి ఏజెంట్ వరకు అలాంటి స్పెషాలిటీ ఉన్న సినిమాలే! ఇంతకీ ఆ సినిమాల ప్రత్యేకత ఏంటి? నటీనటులు ఎందుకు అలా భావిస్తున్నట్టు.? డిస్నిఫైడ్ శాకుంతలాన్ని చూడ్డానికి ప్రేక్షకులు ఈ వేసవిలో సిద్ధంగా ఉండండి అని శాకుంతలం సినిమాని ఇష్టంగా ప్రమోట్ చేస్తున్నారు సమంత. ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లలో ఇప్పటిదాకా తాను పోషించని పాత్రలో కనిపిస్తున్నారు సమంత. అందుకే ఈ సినిమా తన కెరీర్‌లో చాలా స్పెషల్ అంటున్నారు సామ్.
తమిళంలో విడుదలై పెద్ద హిట్ అయిన సినిమా విడుదలై. ఇటీవల టీమ్‌ని పిలిచి రజనీకాంత్ కూడా ప్రశంసించారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ కూడా ఇటీవల విడుదలైంది. సూరి పోలీస్ ఆఫీసర్‌గా, విజయ్ సేతుపతి నక్సలైట్ నాయకుడిగా మెప్పించారు. ఈ నెల్లోనే విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయిటింగ్. సాయిధరమ్‌తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉందంటున్నారు విశ్లేషకులు. ఆద్యంతం థ్రిల్లింగ్ అంశాలతో మెప్పిస్తోంది విరూపాక్ష. ఈ నెల 21న విడుదల కానుంది ఈ సినిమా.
విరూపాక్ష విడుదలైన నెక్స్ట్ వీక్ ఏ ఏజెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు అఖిల్. ఆయన కెరీర్‌లో తొలిసారి స్పై కేరక్టర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం స్పెషల్‌గా మేకోవర్ అయ్యారు అక్కినేని అఖిల్. జుట్టు పెంచి, కండలు పెంచి సరికొత్త లుక్‌లో చలాకీగా కనిపిస్తున్నారు అక్కినేని యంగ్ బోయ్. ఏజెంట్ రిలీజ్ అయిన రోజే ప్రేక్షకుల ముందుకు వస్తోంది పొన్నియిన్ సెల్వన్. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ పార్ట్ ఇచ్చిన జోష్‌తో, సెకండ్ పార్టుని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు మణిరత్నం. విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్, శోభిత ధూళిపాళ కెరీర్లో ఎప్పుడూ గుర్తుండిపోయే సినిమా ఇది.