- Telugu News Photo Gallery Cinema photos Anita Hassanandani Birthday, see how heroine of Nuvvu Nenu movie fame looks now
Anita Hassanandani: అమ్మయ్యాక మరింత అందంగా మారిపోయిన ‘నువ్వు నేను’ సినిమా హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోలు చూశారా?
2001లో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన నువ్వునేను చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది అనిత హస్సానందని. ఇందులో అనిత పోషించిన వసు పాత్రకు కుర్రకారు ఫిదా అయ్యారు.ఈ సినిమాలో తన అందం అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకున్న అనిత...
Updated on: Apr 14, 2023 | 2:01 PM

2001లో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన నువ్వునేను చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది అనిత హస్సానందని. ఇందులో అనిత పోషించిన వసు పాత్రకు కుర్రకారు ఫిదా అయ్యారు.

ఈ సినిమాలో తన అందం అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకున్న అనిత వరుసగా సినిమాలు చేసింది. శ్రీరామ్, తొట్టిగ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను, ఆడంతే అదోటైపు, నేను పెళ్లికి రెడీ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది. కాగా సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే అనిత 2013 అక్టోబర్‌లో గోవా వేదికగా కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుంది.

వీరి ప్రేమబంధానికి గుర్తుగా 2021 ఫిబ్రవరిలో ఆరవ్ అనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది అనిత. వివాహం తర్వాత అనిత సినిమాలు తగ్గించి బాలీవుడ్ లో టీవీ సీరియల్స్ చేస్తోంది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనిత తన బాబు ఫొటోలను షేర్ చేస్తుంటుంది. అలాగే గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తుంటుంద. వీటిని చూసిన నెటిజన్లు అమ్మయ్యాక అనిత అందం మరింత పెరిగిందని కామెంట్లు చేస్తున్నారు.

నేడు (ఏప్రిల్ 14)అనిత పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.




