Rajitha Chanti |
Updated on: Apr 14, 2023 | 12:30 PM
సౌత్ ఆడియన్స్కు పరిచయం అవసరం లేని పేరు అతుల్య రవి. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ కోసం ఎదురుచూస్తుంది అతుల్య.
2017లో కాదల్ కన్ కట్టుదే సినిమాతో వెండితెరకు పరిచయమైంది అతుల్య. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత కథా నాయకన్,సుట్టు పిడిక్క ఉత్తరావు, వట్టం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
తమిళంలో సరైన బ్రేక్ ఎదురుచూస్తున్న ఈముద్దుగుమ్మ.. ఇటీవలే మీటర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మెయిల్ రోల్ పోషించారు.
ఏప్రిల్ 7న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో అనుకున్నంత క్రేజ్ అతుల్య రవికి రాలేదు. అందం, అభినయంతో ఈ ముద్దుగుమ్మ మాత్రం పేక్షకులను ఆకట్టుకుంది.
మీటర్ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా.. తెలుగులో మాత్రం అతుల్య రవికి మంచిగానే ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. మరీ చూడాలి ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ రాణిస్తుందా అనేది.
పట్టు చీరల్లో చందమామా.. ఏడు వన్నెల్లో వెన్నెలమ్మ.. అందాల బుట్టబొమ్మ అతుల్య రవి బ్యూటీఫుల్ ఫోటోస్..