MS Dhoni: ఖుష్బూ అత్తమ్మను సర్‌ప్రైజ్‌ చేసిన ఎంఎస్‌ ధోని.. హీరోలు ఇలాగే పుడతారంటూ నటి ప్రశంసలు.. ఫ్యాన్స్ ఫిదా

టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నా.. అతని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ధోనిని అభిమానించే వారి జాబితాలో సామాన్యులే కాదు ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

MS Dhoni: ఖుష్బూ అత్తమ్మను సర్‌ప్రైజ్‌ చేసిన ఎంఎస్‌ ధోని.. హీరోలు ఇలాగే పుడతారంటూ నటి ప్రశంసలు.. ఫ్యాన్స్ ఫిదా
Ms Dhoni, Khushbu
Follow us
Basha Shek

|

Updated on: Apr 15, 2023 | 9:22 AM

టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నా.. అతని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ధోనిని అభిమానించే వారి జాబితాలో సామాన్యులే కాదు ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా మిస్టర్‌ కూల్‌ ధోని ప్రముఖ సినీనటి ఖుష్బూ అత్తమ్మను కలిసి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కాగా చెపాక్‌ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓడిపోయింది. దీని తర్వాత ఈనెల 17న బెంగళూరుతో ధోని సేన ఆడాల్సి ఉంది. అయితే మ్యాచ్‌కు ముందు నాలుగు రోజుల విశ్రాంతి దొరకడంతో ధోని రిలాక్స్ అవుతున్నాడు. తన అభిమానులను కలుస్తూ సర్‌ప్రైజ్‌ చేస్తున్నాడు. అలా తాజాగా సినీ నటి ఖష్బూ కుటుంబ సభ్యులను కలిశాడు. ఈ సందర్భంగా తమను కలిసేందుకు వచ్చిన ధోనిని ఖుష్బూ అత్తమ్మ ఆప్యాయంగా ముద్దాడారు. అందరూ కలిసి సరదాగా ఫొటోలు దిగారు.

ధోనితో కలిసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది ఖుష్బూ. ఈ క్రమంలో ధోని సింప్లిసిటీపై ప్రశంసలు కురిపించారామె. ‘హీరోలు తయారుకారు.. పుడతారు.. ధోనీ ఆ విషయాన్ని ఇవాళ నిరూపించాడు. ధోనీ ప్రేమ, ఆతిథ్యానికి నాకు మాటలు రావడం లేదు. మా అత్తగారు ధోనీని ఎంతగానో ఆరాధిస్తుంటారు. ఇప్పుడామెను ధోని కలిశారు. ఆమె ఆయుష్షను, సంతోషాన్ని మరింత పెంచారు. ఇందుకు ధోనికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా కలను నిజం చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఓ విజిల్‌’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది ఖుష్బూ. ప్రస్తుతం ధోని, ఖుష్బూల ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?