KKR vs SRH: ధనాధన్ సెంచరీతో ట్రోల్స్‌కు చెక్ పెట్టిన 13 కోట్ల ప్లేయర్.. గ్యాలరీలో మురిసిపోయిన గర్ల్ ఫ్రెండ్
ఎట్టకేలకు హ్యారీ బ్రూక్ అదరగొట్టాడు. ఎంతో నమ్మకంతో తన కోసం వెచ్చించిన రూ.13 కోట్లకు న్యాయం చేసే ఇన్నింగ్స్ ఆడాడు. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ సెంచరీతో చెలరేగాడు. మొదటి మ్యాచుల్లో తక్కువ స్కోరుకే వెనుదిరిగి విమర్శలు ఎదుర్నొన్న ఈ సొగసరి బ్యాటర్ ఈ సీజన్‌లో తొలి శతకాన్ని..
ఎట్టకేలకు హ్యారీ బ్రూక్ అదరగొట్టాడు. ఎంతో నమ్మకంతో తన కోసం వెచ్చించిన రూ.13 కోట్లకు న్యాయం చేసే ఇన్నింగ్స్ ఆడాడు. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ సెంచరీతో చెలరేగాడు. మొదటి మ్యాచుల్లో తక్కువ స్కోరుకే వెనుదిరిగి విమర్శలు ఎదుర్నొన్న ఈ సొగసరి బ్యాటర్ ఈ సీజన్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. కేవలం 55 బంతుల్లో12 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బ్రూక్ సెంచరీ ఇన్నింగ్స్ కారణంగా మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ భారీ స్కోరు సాధించింది. ఆతర్వాత కోల్‌కతాను కట్టడి చేసి 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుమ్మురేపే శతకంతో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను గెలిపించిన హ్యారీకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. కాగా బ్రూక్ ఇన్నింగ్స్‌ను అతని గర్ల్‌ఫ్రెండ్ లూసీ ప్రత్యక్షంగా వీక్షించింది. అతను మైదానంలో ఆడుతున్నంత సేపూ చప్పట్లు కొడుతూ ప్రోత్సహించింది. ప్రస్తుతం బ్రూక్- లూసీలకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
నా గర్ల్ ఫ్రెండ్ మాత్రమే ఉండిపోయింది..
కాగా సెంచరీ అనంతరం మాట్లాడిన హ్యారీ బ్రూక్ తన ఇన్నింగ్స్ , అలాగే ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ‘ ఈ మ్యాచ్‌లో బాగా ఆడాలని మాత్రమే అనుకున్నా. కానీ ఇలా సెంచరీ సాధిస్తానని అసలు అనుకోలేదు. నేను ఐపీఎల్ ఆడుతున్నానని తెలిసి మా ఫ్యామిలీ మొత్తం ఇండియాకు వచ్చింది. అయితే కొన్ని కారణాల రీత్యా వాళ్లంతా స్వదేశానికి వెళ్లిపోయారు. నా గర్ల్‌ఫ్రెండ్ మాత్రం ఇక్కడే ఉంది. నా సెంచరీ ఇన్నింగ్స్‌ను బాగా ఎంజాయ్ చేసింది. ఈరోజు నా పెర్ఫామెన్స్‌పై నా ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉంటుందని భావిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు బ్రూక్.
వీడియో..
हैरी ब्रूक का शतक का सेलेब्रेशन pic.twitter.com/KsCRey6HWv
— Lokesh Pandat (@LokeshS30714400) April 14, 2023
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..