IPL 2023: కుర్రాళ్లకు ధీటుగా.. ధనాధన్‌ లీగ్‌లో దుమ్ము రేపుతోన్న అంకుల్స్‌.. లిస్టులో ఎవరెవరున్నారంటే?

సాధారణంగా యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఐపీఎల్‌ చక్కగా ఉపయోగపడుతోంది. జాతీయ జట్టులోకి ప్రవేశించేందుకు ఈ ధనాధాన్‌ లీగ్‌ ఒక మంచి వేదిక. అయితే ఈ సీజన్‌లో యువ ఆటగాళ్లతో పాటు సీనియర్‌ ప్లేయర్లు కూడా అదరగొడుతున్నారు.

IPL 2023: కుర్రాళ్లకు ధీటుగా.. ధనాధన్‌ లీగ్‌లో దుమ్ము రేపుతోన్న అంకుల్స్‌.. లిస్టులో ఎవరెవరున్నారంటే?
Dhoni, Shikhar, Amit
Follow us
Basha Shek

|

Updated on: Apr 15, 2023 | 12:36 PM

ఐపీఎల్ 2023 ఆసక్తికరంగా సాగుతోంది. దాదాపు అన్ని మ్యాచులు హోరాహోరీగా సాగుతుండడంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.  సాధారణంగా యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఐపీఎల్‌ చక్కగా ఉపయోగపడుతోంది. జాతీయ జట్టులోకి ప్రవేశించేందుకు ఈ ధనాధాన్‌ లీగ్‌ ఒక మంచి వేదిక. అయితే ఈ సీజన్‌లో యువ ఆటగాళ్లతో పాటు సీనియర్‌ ప్లేయర్లు కూడా అదరగొడుతున్నారు. ఇందులో జాతీయ జట్టు నుంచి రిటైరైన ప్లేయర్లు, అలాగే నాలుగు పదుల వయసుకు దగ్గరున్న ఆటగాళ్లు ఉన్నారు. ఏజ్‌ జస్ట్‌ నెంబర్‌ అనే మాటను నిరూపిస్తూ బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లో రాణిస్తూ ఐపీఎల్‌లో తమ దైన ముద్ర వేస్తున్నారు. ఇందులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ధోని, పంజాబ్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌, గుజరాత్‌ స్వింగ్‌ బౌలర్‌ మోహిత్‌ శర్మ, లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్‌ అమిత్ మిశ్రా, ముంబై మిస్టరీ స్పిన్నర్‌ పీయుష్‌ చావ్లా తదితరుల సీనియర్‌ ఆటగాళ్లు ఉన్నారు.

ఎంఎస్ ధోని

సాధారణంగా, వయస్సు పెరిగే కొద్దీ క్రికెటర్ల స్ట్రైక్ రేట్ తగ్గిపోతుంది. అయితే 41 ఏళ్ల ధోని విషయంలో మాత్రం ఇది పూర్తిగా భిన్నం. ఎందుకంటే గత సీజన్లకంటే ఈసారి ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధిస్తున్నాడు మిస్టర్‌ కూల్‌. ఫినిషర్‌గా ఆఖరి ఓవర్లలో బరిలోకి దిగిన ధోని ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో మొత్తం 58 పరుగులు చేశాడు. ఇందులో 6 సిక్సర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

శిఖర్‌ ధావన్‌

జాతీయ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన ధావన్‌ వయస్సు 37కు పైగానే ఉంటుంది. IPL 2023లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తున్నాడీ సీనయర్‌ ప్లేయర్‌. కెప్టెన్సీలోనే కాదు బ్యాటింగ్‌లోనూ దూకుడు చూపిస్తున్నాడు. శిఖర్ ధావన్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లలో 233 పరుగులు చేశాడు. ఇందులో 99 పరుగుల ఇన్నింగ్స్‌ కూడా ఉంది. ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ధావనే కావడం విశేషం.

అమిత్ మిశ్రా

IPL 2023లో మోస్ట్‌ సీనియర్‌ ప్లేయర్లలో అమిత్‌ మిశ్రా ఒకడు. 40 ఏళ్ల అమిత్‌ ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆడిన అతను 3 వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ కూడా కేవలం 6.83 మాత్రమే. ఇక ఫీల్డింగ్‌లోనూ అదరగొడుతున్నాడీ సీనియర్‌ స్పిన్నర్‌.

పీయూష్ చావ్లా

34 ఏళ్లు పైబడిన పీయూష్ చావ్లా కూడా ఐపీఎల్ 2023లో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన చావ్లా 4 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. అందులో 3 వికెట్లు ఒకే మ్యాచ్‌లో తీయడం గమనార్హం.

మోహిత్ శర్మ

ధోని ఫేవరెట్‌ బౌలర్‌గా పేరున్న మోహిత్‌ శర్మ గత 3 ఏళ్ల పాటు IPLకు దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా గుజరాత్‌ తరఫున బరిలోకి దిగిన ఈ 32 ఏళ్ల ప్లేయర్‌ కేవలం 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. తద్వారా తనలో ఏ మాత్రం పస తగ్గలేదని నిరూపించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్