Video: రోహిత్ కన్నా ఎమోషనల్.. గ్రాండ్ విక్టరీ తర్వాత సూర్యకుమార్ ఏం చేశాడో తెలుసా..?
Suryakumar Yadav emotional after T20 World Cup 2026 win: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగానికి గురయ్యాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పిచ్ మట్టిని తాకి గౌరవం తెలిపిన అతని భావోద్వేగ క్షణం అభిమానులను ఆకట్టుకుంది.

అద్భుతం.. అత్యద్భుతం.. టీమిండియా ఆటగాళ్ల ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసింది సూర్యకుమార్ సేన. ప్రత్యర్థిని చిత్తుచేసి విశ్వవిజేతగా నిలిచింది. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ (ICC Men’s T20 World Cup 2026) మ్యాచ్ భారత్‌కు చిరస్మరణీయ రాత్రిగా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium) లో జరిగిన ఈ ఫైనల్‌లో భారత జట్టు (India national cricket team) 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టును (New Zealand national cricket team) ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయం ద్వారా భారత్ వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.
పిచ్ మట్టిని తాకిన సూర్యకుమార్..
🇮🇳🏆 CHAMPIONS OF THE WORLD AGAIN!
History rewritten in Ahmedabad! What a moment for every Indian 🇮🇳
That gesture from SuryaKumar Yadav says it all bowing down to the soil, touching the ground with pride. This is more than victory, this is emotion… this is mere desh ki mitti.… pic.twitter.com/iet3XY47Yz
— Shivank Mishra (@shivank_8mishra) March 8, 2026
విజయం తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే పిచ్ మధ్యకు వెళ్లి మట్టిని చేతితో తాకి ఆ మట్టిని తలపై పెట్టుకుని గౌరవం తెలిపాడు. ఈ క్షణం అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
ఇది 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఎదుర్కొన్న ఓటమి జ్ఞాపకాలను కూడా చెరిపేసింది. అదే వేదికపై ఇప్పుడు భారత్ విజయం సాధించడం అభిమానులకు ప్రత్యేకమైన ఆనందాన్ని ఇచ్చింది.
కెప్టెన్‌గా సూర్యకుమార్ అద్భుత నాయకత్వం..
ఈ టోర్నమెంట్ మొత్తం సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం ప్రశంసలు అందుకుంది. మ్యాచ్‌ల్లో కీలక సమయాల్లో చేసిన బౌలింగ్ మార్పులు, వ్యూహాత్మక నిర్ణయాలు జట్టుకు విజయాన్ని అందించాయి. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో అతని నిర్ణయాలు జట్టుకు కీలకంగా మారాయి.
ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా సంజూ శాంసన్..
ఈ టోర్నమెంట్‌లో సంజూ శాంసన్ (Sanju Samson) అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు.
వెస్టిండీస్‌పై సూపర్-8 మ్యాచ్‌లో 97 పరుగులు*
ఇంగ్లాండ్‌పై సెమీఫైనల్‌లో 89 పరుగులు
న్యూజిలాండ్‌పై ఫైనల్‌లో 89 పరుగులు
ఈ కీలక ఇన్నింగ్స్‌లతో భారత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లడంలో సంజూ కీలక పాత్ర పోషించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
