AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండస్ట్రీలో విషాదం.. నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. జనవరి 21, 1952న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించిన ప్రదీప్ రావత్ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ‘సై’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ రావత్.. బిక్షూ యాదవ్ పాత్రతో మరింత ఫేమస్ అయ్యారు.

ఇండస్ట్రీలో విషాదం.. నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత..
Pradeep Rawath
Rajitha Chanti
|

Updated on: Aug 04, 2026 | 9:39 PM

Share

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 74 ఏళ్ల రావత్, ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. జనవరి 21, 1952న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించిన ప్రదీప్ రావత్ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ‘సై’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ రావత్.. బిక్షూ యాదవ్ పాత్రతో మరింత ఫేమస్ అయ్యారు. ఈ సినిమాకు ఉత్తమ ప్రతినాయకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. అలాగే ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాలో రాజ్ బిహారిగా అదిరిపోయే విలనిజంతో మెప్పించారు. ఇక తెలుగులో భద్ర, దేశముదురు, స్టాలిన్, నేను శైలజ, ఓయ్ సినిమాలతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు. తెలుగులో చివరగా ‘గాయపడ్డ సింహం’లో నటించారు. తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో కేవలం హిందీకే పరిమితం కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, భోజ్‌పురి, నేపాలీ ఇలా పలు భాషల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి బహుభాషా నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు.

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

తెలుగులో ఎన్నో చిత్రాల్లో మెప్పించిన ప్రదీప్ రావత్.. 2004లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాలోనే ‘బిక్షూ యాదవ్’ పాత్రలో ఆయన పూర్తిగా ఒదిగిపోయిన తీరు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ అద్భుతమైన నటనకు గాను ఆయనకు ఉత్తమ ప్రతినాయకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది. ఆ తర్వాత వచ్చిన ‘గజిని’ సినిమాలో ప్రదీప్ రావత్ చేసిన మెయిన్ విలన్ క్యారెక్టర్ అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. ఆ సినిమాతో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయి మోస్ట్ వాంటెడ్ విలన్‌గా మారిపోయారు.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

‘సై’ తర్వాత తెలుగులో ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ సినిమాలో ‘రాజ్ బిహారి’గా మరోసారి అదిరిపోయే విలనిజం పండించారు. ఆ తర్వాత ‘భద్ర’, ‘దేశముదురు’, ‘స్టాలిన్’, ‘నేను శైలజ’, ‘ఓయ్’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి విలన్‌గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. క్రూరమైన ప్రతినాయకుడి పాత్రలే కాకుండా కొన్ని క్యారెక్టర్ రోల్స్ కూడా చేసి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. నేను శైలజలో ఆయన చేసిన కామెడీ కడుపుబ్బా నవ్వించింది. కాగా తెలుగులో ఆయన చివరగా తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ‘గాయపడ్డ సింహం’ సినిమాలో నటించారు. తన గంభీరమైన నటనతో దశాబ్దాల పాటు సినీ అభిమానులను అలరించిన ప్రదీప్ రావత్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us
చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో
చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో
వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా
వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా
వర్షం కురిసింది.. పంట మురిసింది..
వర్షం కురిసింది.. పంట మురిసింది..
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది