Rakul Preet Singh : నేషనల్ గోల్ఫర్.. కరాటేలో బ్లూ బెల్ట్ ఛాంపియన్.. రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఆసక్తికర విషయాలు..
రాకుల్ ప్రీత్ సింగ్ అక్టోబర్ 10న పుట్టినరోజు. తెరపై గ్లామరస్ నటి అయిన ఆమె, నిజ జీవితంలో జాతీయ గోల్ఫ్ క్రీడాకారిణి , కరాటే బ్లూ బెల్ట్ ఛాంపియన్ కూడా. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో తనదైన నటనతో అలరించిన ఈ ముద్దుగుమ్మ లైఫ్ స్టైల్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. తెలుగులో అగ్ర హీరోలందరితో కలిసి నటించింది రకుల్.

టాలీవుడ్ , బాలీవుడ్ ఇండస్ట్రీలో తన అందంతో, అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలు అంతగా చేయకపోయినప్పటికీ సోషళ్ మీడియాలో ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లకు దగ్గరవుతుంది. తెలుగులో స్టార్ హీరోస్ అందరితో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ ద్వారా అలరించింది. అక్టోబర్ 10న తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ‘దే దే ప్యార్ దే’, ‘డాక్టర్ జీ’, ‘ఛత్రివాలి’ వంటి చిత్రాలతో పాటు పలు విజయవంతమైన తెలుగు సినిమాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెరపై ఎప్పుడూ నవ్వుతూ, చాలా గ్లామర్‌గా కనిపించే రకుల్.. నిజ జీవితంలో మాత్రం చాలా స్ట్రాంగ్ అండ్ ఫిట్ పర్సన్. ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి రావడంతో ఆమె చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, తెగింపు నేర్చుకున్నారు.
కేవలం నటి మాత్రమే కాదు, ఆమెలో మరో కోణం కూడా ఉంది. ఆమె చదువుకునే రోజుల్లో నేషనల్ లెవెల్ గోల్ఫ్ టోర్నమెంట్‌లలో పాల్గొన్న ప్రతిభావంతురాలైన గోల్ఫర్. అంతేకాకుండా కరాటేలో ‘బ్లూ బెల్ట్’ సాధించిన ప్రొఫెషనల్ మార్షల్ ఆర్ట్ ఆర్టిస్ట్. ఆమె తండ్రి కుల్విందర్ సింగ్ ఇండియన్ ఆర్మీలో కల్నల్‌గా పనిచేయడంతో, రకుల్‌కు చిన్ననాటి నుంచే ఆత్మరక్షణ మెలుకువలు, కఠినమైన ఫిట్‌నెస్ అలవాటయ్యాయి. ఆమె కాలేజీ రోజుల్లో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటుంది. ఒకసారి రకుల్ తన స్నేహితులతో కలిసి గర్ల్స్ ట్రిప్‌కి వెళ్లినప్పుడు రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లో షాపింగ్ చేస్తున్నారు. అప్పుడు ఒక యువకుడు రహస్యంగా రకుల్ ఫోటోలు తీయడం గమనించారు. సాధారణ అమ్మాయిలైతే భయపడిపోయి వెనకడుగు వేస్తారు, కానీ కరాటేలో శిక్షణ పొందిన రకుల్ మాత్రం అస్సలు వెనకడుగు వేయలేదు.
వెంటనే ఆ యువకుడి దగ్గరికి వెళ్లి ఫోన్ లాక్కుని ఫొటోస్ డిలీట్ చేశారు. ఆ వ్యక్తి ఎదురు తిరిగి వాగ్వాదానికి దిగడంతో, రకుల్ ఏమాత్రం భయపడకుండా అతడి కాలర్ పట్టుకుని చెంపదెబ్బ కొట్టారు. ఆ తర్వాత అతను పారిపోతుంటే వెంబడించి మరీ బుద్ధి చెప్పారు. రకుల్ చూపించిన ఈ డేరింగ్ అండ్ డాషింగ్ యాటిట్యూడ్ చూసి అక్కడున్న వారంతా ఖంగుతిన్నారు. సినిమాల్లోకి వచ్చాక కూడా ఏ గడ్ ఫాదర్ లేకుండా తన ప్రతిభతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రకుల్.. ఫిట్‌నెస్ విషయంలోనూ ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి: Nana Patekar : నా ఆస్తి ఆ 12 ఎండు కట్టలే.. నేను ముందే పక్కన పెట్టుకున్నా.. నానా పటేకర్ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ..
ఎక్కువమంది చదివినవి: Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్ పర్సన్.. నటనలో మా ఇద్దరికీ పోటీ ఉండేది.. హీరో శ్రీకాంత్..
