AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jailer 2: కుర్రాళ్ల కొత్త క్రష్.. రజినీకాంత్ కోసం కత్తిపట్టిన మిస్టరీ గర్ల్.. ఎవరీ హీరోయిన్.. ?

సూపర్‌స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ బ్లాక్‌బస్టర్ చిత్రం జైలర్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా 'జైలర్ 2' తెరకెక్కుతోంది. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించడంతో, ఈ సీక్వెల్‌పై సౌత్ వ్యాప్తంగానే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో అపారమైన అంచనాలు ఉన్నాయి.

Jailer 2: కుర్రాళ్ల కొత్త క్రష్.. రజినీకాంత్ కోసం కత్తిపట్టిన మిస్టరీ గర్ల్.. ఎవరీ హీరోయిన్.. ?
Apeksha Porwal
Rajitha Chanti
|

Updated on: Oct 10, 2026 | 9:45 AM

Share

సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న అత్యంత క్రేజీ సీక్వెల్ ‘జైలర్ 2’. ఈ మూవీపై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ నెలకొన్న సంగతి తెలిసిందే. గతంలో విడుదలైన జైలర్ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో జైలర్ 2 చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ నెట్టింట రికార్డు వ్యూస్‌తో దుమ్మురేపుతోంది. విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, జాకీ ష్రాఫ్ వంటి అగ్ర నటీనటులు కనిపించినప్పటికీ, ట్రైలర్‌లో కొన్ని సెకన్ల పాటు చేతిలో గన్ పట్టుకుని, స్టైలిష్ యాక్షన్ సీన్స్‌తో మెరిసిన ఒక కొత్త భామ అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో అసలు ఆ మిస్టరీ గర్ల్ ఎవరు? అని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వెతకడం ప్రారంభించారు. ఆ బ్యూటీ మరెవరో కాదు.. అపేక్షా పోర్వాల్.

ఎక్కువమంది చదివినవి: Bathukamma Song : యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మంగ్లీ కొత్త బతుకమ్మ పాట.. గంటల్లోనే 

అపేక్షా పోర్వాల్ మోడలింగ్ ప్రపంచంలో మంచి గుర్తింపు పొందిన భామ. 2015లో ‘మిస్ ఇండియా’ కిరీటాన్ని గెలుచుకున్న ఈమె, 2017 ‘మిస్ దివా’ పోటీలలో సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా థియేటర్ ఆర్టిస్ట్‌గా ‘అన్‌డైయింగ్ ఫ్లేమ్’ వంటి నాటకాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటించి మెప్పించిన అపేక్షా.. ‘జైలర్ 2’ చిత్రంతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ‘జైలర్ 2’ ట్రైలర్‌లో అపేక్షా చూపించిన పవర్ ఫుల్ యాక్షన్ మూవ్స్ వెనుక పెద్ద శిక్షణే ఉంది. ఈమె ప్రావీణ్యమున్న కథాకళి నృత్యకారిణి కావడమే కాకుండా, ప్రొఫెషనల్ కిక్‌బాక్సింగ్ , మార్షల్ ఆర్ట్స్‌లో కూడా కఠినమైన శిక్షణ తీసుకున్నారు. అందుకే నెల్సన్ యాక్షన్ వరల్డ్‌లో ఆమె చేసిన స్టంట్స్ ఎంతో సహజంగా, పవర్‌ఫుల్‌గా వచ్చాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి: Jaya Prada: ఆ హీరోకు అత్తగా నటించా.. అతడు అంటే నాకు పిచ్చి ఇష్టం.. జయప్రద..

ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్‌పై అపేక్షా స్పందిస్తూ.. “ప్రతిచోటా నా పిక్స్ చూస్తున్నాను.. ట్రైలర్‌లో నన్ను గుర్తుపట్టారా?” అంటూ ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఖరారు చేశారు. అక్టోబర్ 15న దసరా కానుకగా విడుదల కానున్న ఈ సినిమాలో అపేక్షా రోల్ ఏ స్థాయిలో ఉంటుందో అని సినీ ప్రియులు తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి: Nana Patekar : నా ఆస్తి ఆ 12 ఎండు కట్టలే.. నేను ముందే పక్కన పెట్టుకున్నా.. నానా పటేకర్ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ..

అపేక్షా పోర్వాల్..

ఎక్కువమంది చదివినవి: Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్ పర్సన్.. నటనలో మా ఇద్దరికీ పోటీ ఉండేది.. హీరో శ్రీకాంత్..

Follow Us
ఎబోలా మహమ్మారి విలయం.. 5 వేలు దాటిన మరణాలు.. 10 వేల మందికి వైరస్
ఎబోలా మహమ్మారి విలయం.. 5 వేలు దాటిన మరణాలు.. 10 వేల మందికి వైరస్
ఓటర్ స్లిప్ చూపించండి.. కేజీ చికెన్ పొందండి.. ఎన్నికల వేళ
ఓటర్ స్లిప్ చూపించండి.. కేజీ చికెన్ పొందండి.. ఎన్నికల వేళ
బొంబాయి రవ్వతో ఇలా జంతికలు చేస్తే.. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి
బొంబాయి రవ్వతో ఇలా జంతికలు చేస్తే.. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి
ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ.. పోలీసుల కీలక ప్రకటన
ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ.. పోలీసుల కీలక ప్రకటన
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. సోనా మసూరి కేజీ ధర ఎంతో తెలుసా..?
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..
రాప్తాడు ఘటనపై డైరెక్టర్ వేణు ఉడుగుల రియాక్షన్..