AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Prices: వెండి కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఇదే మంచి ఛాన్స్.. చౌక ధరకే..

బంగారంతో పోలిస్తే సిల్వర్ ధరలు భారీగా పడిపోతున్నాయి. గత ఏడాదిగా వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. డాలర్ బలపడటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. అలాగే పారిశ్రామిక అవసరాల్లో కూడా వెండికి డిమాండ్ తగ్గుతుంది. ఈ కారణాలతో వెండి విలువ బాగా తగ్గిపోతుంది.

Venkatrao Lella
|

Updated on: Oct 10, 2026 | 9:57 AM

Share
బంగారంతో పాటు వెండికి కూడా మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ప్రజలు పూజా సామాగ్రి, వెండి పట్టీలు, మెట్టెలు, దేవుడి ప్రతిమలు, వెండి గ్లాసులు, బిస్కెట్లు వంటి రూపంలో కొనుగోలు చేస్తుంటారు. దీంతో పాటు డిజిటల్ రూపంలో వెండిలో పెట్టుబడి పెడుతుంటారు. అయితే బంగారంతో పోలిస్తే వెండిని పారిశ్రామిక రంగంలో ఎక్కువగా వినియోగిస్తారు

1 / 5
డేటా సెంటర్లు, ఈవీ వెహికల్స్, చిప్‌లు, విద్యుత్ రంగంలో దీని వాడకం ఎక్కువగా ఉంటుంది. దీంతో అంతర్జాతీయ పరిణామాలకు వెండి ఎక్కువగా ప్రభావితం అవుతుంది. బంగారంతో పోలిస్తే గత కొద్ది నెలలుగా వెండి భారీగా క్షీణిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బంగారం 3 శాతం క్షీణించగా.. వెండి ఏకంగా 16 శాతం పడిపోయింది. బంగారం, వెండి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది.

2 / 5
పెట్టుబడి లాభాల పరంగా చూస్తే వెండి మంచి పనితీరు కనబరుస్తుంది. గత సంవత్సరం కాలపరిమితిలో వెండి 23.38 శాతం లాభాలు తెచ్చి పెట్టగా.. బంగారం కేవలం 3.81 శాతం మాత్రమే. ఆక గత ఐదేళ్లలో వెండి 167.71 శాతం, బంగారం 138.77 శాతం రాబడిని తెచ్చిపెట్టింది. ఐటు ఐదేళ్ల కాలపరిమితి చూస్తే వెండి 249.72 శాతం, బంగారం 233.98 శాతంగా ఉంది.

3 / 5
గత ఏడాది, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో బంగారం కంటే వెండిలో పెట్టుబడులు పెట్టినవారికి ఎక్కువ రాబడి వచ్చింది. అయితే గత ఏడాది నుంచి వెండి భారీగా క్షీణిస్తోంది. గత ఆరు నెలల్లో సిల్వర్ 20.14 శాతం పడిపోగా.. నెల రోజుల్లో 8.14 శాతం తగ్గుముఖం పట్టింది. సిల్వర్ భారీగా కుప్పకూలడం వెనుక అనేక కారణాలు వినిపిస్తున్నాయి.

4 / 5
వ్యాపార అవసరాల్లో వెండి వినియోగం ఈ ఏడాది 3 శాతం తగ్గుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఇక డాలర్ బలపడటం, సిల్వర్ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడిదారులు డబ్బులు విత్ డ్రా చేసుకుంటుండటం కారణాలుగా తెలుస్తుంది. కేంద్ర బ్యాంకులు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుండగా.. వెండికి అలాంటి ఛాన్స్ లేదు. ఇది కూడా మరొక కారణంగా చెప్పవచ్చు.

5 / 5
Follow Us