AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా ఫీచర్‌పై కొత్త అప్డేట్.. అప్పటినుంచే సేవలు.. క్లారిటీ వచ్చేసింది..!

ఈపీఎఫ్ ఖాతాదారులలో ప్రస్తుతం ఒక సందేహం నెలకొంది. ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ నిధులు ఉపసంహరించుకునే సదుపాయం ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. ఈ ప్రశ్నలకు సంబంధించి ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉండగా.. ప్రారంభానికి రంగం సిద్దమైంది.

EPFO: యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా ఫీచర్‌పై కొత్త అప్డేట్.. అప్పటినుంచే సేవలు.. క్లారిటీ వచ్చేసింది..!
Epfo Upi
Venkatrao Lella
|

Updated on: Oct 10, 2026 | 1:06 PM

Share

యూపీఐ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకునే సదుపాయం ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందనే దానిపై ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జూలై 1 నుండి ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని తొలుత ఈపీఎఫ్ఓ భావించింది. కానీ పీఎఫ్ సంస్థ సిస్టమ్ అప్‌గ్రేడేషన్ చేపట్టిన క్రమంలో యూపీఐ విత్ డ్రా ఫీచర్ తీసుకురావడంలో జాప్యం జరిగింది. ఇది అందుబాటులోకి వస్తే పీఎఫ్ విత్ డ్రా మరింత సులువవుతుంది. దీంతో ఈ ఫీచర్ కోసం ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఎదుచరూస్తున్నారు. ఈ క్రమంలో ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందింది. త్వరలోనే ఈ ఫీచర్ రానుందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రారంభానికి ముహూర్తం కూడా ఖరారు అయినట్లు సమాచారం.

యూపీఐ ద్వారా విత్ డ్రా ఎలా..?

ప్రస్తుతం బ్యాంకుల సహకారంతో యూపీఐ విత్ డ్రా ఫీచర్‌పై టెస్టింగ్ జరుగుతోంది. ఈ పనులు కూడా దాదాపు ముగియడంతో ఇక ప్రారంభమే తరువాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఇందుకోసం ఒక కొత్త యాప్‌ను తీసుకురానున్నారు. ఈ యాప్‌ భీమ్ యాప్‌తో పాటు ఇతర యూపీఐ యాప్స్‌తో అనుసంధానించబడి ఉంటుంది. దీంతో ఆ యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతాన్ని యూపీఐ విధానం ఉపయోగించి ఖాతాదారులు విత్ డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాలో కనీసం 25 శాతం బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధనల వల్ల మొత్తం విత్ డ్రా చేసుకోలేరు. మిగిలిన సొమ్మును ఎప్పుడైనా యూపీఐ ద్వారా ఉపసంహరించుకోవచ్చు.

ఏటీఎం సదుపాయం ఎప్పుడు?

ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ 3.0కి మైగ్రేషన్ ఇంకా జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే యూపీఐతో పాటు ఏటీఎం ద్వారా నిధుల ఉపసంహరణ సదుపాయం అందుబాటులోకి రానుంది.ఈ మైగ్రేషన్ పూర్తయిన తర్వాత వెబ్‌సైట్ స్థిరంగా, ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా పనిచేస్తుందని నిర్ధారించుకున్న తర్వాతే ఈ కొత్త సేవలను ప్రారంభించనున్నారు. కేవలం వెబ్‌సైట్ మైగ్రేషన్ మాత్రమే కాకుండా.. ఈ సదుపాయాన్ని బ్యాంకులకు అనుసంధానించడం, యూపీఐ కోసం ప్రత్యేక అప్లికేషన్ లేదా వెబ్‌సైట్‌లో అదనపు కార్యాచరణను అభివృద్ధి చేయడం వంటి పనులు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియలు ప్రస్తుతం శరవేగంగా జురుగుతున్నాయి. డిసెంబర్ నుంచి యూపీఐ, ఏటీఎం విత్ డ్రా సదుపాయాలు వచ్చే అవకాశముంది. ఇవి అందుబాటులోకి వస్తే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా మరింత సులువుకానుంది. ప్రస్తుతం పీఎఫ్ క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నాక అకౌంట్లో జమ కావడానికి మూడు రోజుల సమయం పడుతుంది. యూపీఐ విత్ డ్రా ఫీచర్ అందుబాటులోకి వస్తే.. కేవలం గంటల్లోనే క్లెయిమ్ సెటిల్ అవుతుంది.

Follow Us
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అందుబాటులోకి అప్పుడే..!
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అందుబాటులోకి అప్పుడే..!
లైక్‌లు, కామెంట్ల పిచ్చి.. మీ మానసిక ఆరోగ్యాన్ని మీరే..
లైక్‌లు, కామెంట్ల పిచ్చి.. మీ మానసిక ఆరోగ్యాన్ని మీరే..
ఢిల్లీ ఫ్యాన్స్‌కు షాక్.. భారత్-శ్రీలంక మ్యాచ్ వేదిక మార్పు
ఢిల్లీ ఫ్యాన్స్‌కు షాక్.. భారత్-శ్రీలంక మ్యాచ్ వేదిక మార్పు
ట్రైన్ రద్దయితే రీఫండ్ మొత్తం వస్తుందా..? రైల్వేశాఖ రూల్స్..
ట్రైన్ రద్దయితే రీఫండ్ మొత్తం వస్తుందా..? రైల్వేశాఖ రూల్స్..
ప్రాణంగా ప్రేమిస్తే.. మరొకరితో సన్నిహితంగా ప్రియురాలు.. చివరకు
ప్రాణంగా ప్రేమిస్తే.. మరొకరితో సన్నిహితంగా ప్రియురాలు.. చివరకు
రణబాలి ట్రైలర్ పై నారా లోకేష్ ప్రశంసలు..
రణబాలి ట్రైలర్ పై నారా లోకేష్ ప్రశంసలు..
సామెత అర్థం: ఎగిరెగిరి దంచినా అంతే కూలి.. ఎగరక దంచినా అంతే కూలి!
సామెత అర్థం: ఎగిరెగిరి దంచినా అంతే కూలి.. ఎగరక దంచినా అంతే కూలి!
వారానికి ఒక్కసారైనా తినండి.. మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్..
వారానికి ఒక్కసారైనా తినండి.. మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్..
నవరాత్రుల్లో 9 రోజులు ఏయే అమ్మవారి రూపాలను పూజించాలి? నవదుర్గల..
నవరాత్రుల్లో 9 రోజులు ఏయే అమ్మవారి రూపాలను పూజించాలి? నవదుర్గల..
వెండిని మెరిపించడానికి ఖరీదైన కెమికల్స్ వద్దు.. గోధుమ పిండితో ఇలా
వెండిని మెరిపించడానికి ఖరీదైన కెమికల్స్ వద్దు.. గోధుమ పిండితో ఇలా