2000లో దసరా రోజు బంగారం ధర ఎంతో తెలుసా..? మరీ ఇంత చీపా..

Venkatrao Lella

Images: Pinterest

10 OCT 2026

బంగారం ధరల గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రతీ రోజు ధరలు ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తూ ఉంటారు. ఇక గోల్డ్ కొనాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ముందుగా ధరలు తెలుసుకుంటారు.

గతంలో అత్యంత చౌకగా ఉన్న బంగారం ధరలు గత రెండేళ్లుగా రికార్డ్ స్థాయిలో పెరుగుతూ వస్తోన్నాయి. అక్టోబర్ 20న దసరా రానుండగా.. ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. 2000వ సంవత్సరంలో గోల్డ్ ధర ఎంత ఉందంటే..

2000వ సంవత్సరం దసరా పండుగ సమయంలో 10 గ్రాముల గోల్డ్ రేటు కేవలం రూ.4,400గా ఉంది. ఇప్పుడు దసరా నాటికి ఏకంగా రూ.1.50 లక్షలకు చేరుకుంది. 

26 ఏళ్లల్లో చూసుకుంటే.. గోల్డ్ రేటు ఏకంగా 34 రేట్లు పెరిగిందని చెప్పవచ్చు. దీంతో 2000లో బంగారం కొనుగోలు చేసివారు ఇప్పుడు భారీ లాభాలను అర్జిస్తున్నారు.

2000లో రూ.4,400గా ఉండగా.. 2001 నాటికి రూ.4,300కి తగ్గింది. ఇక 2002లో రూ.4,990, 2003లో రూ.5600, 2004లో రూ.6307గా ఉంది.

2005లో రూ.7,638 వద్ద ఉండగా.. 2006లో రూ.9,265, 2007లో రూ.10,598కి చేరుకుంది. ఇక 2008లో రూ.13,630, 2009లో రూ.16,686, 2010లో రూ.20,728కి చేరుకుంది.

2011లో రూ.27,329, 2012లో రూ.30,859, 2013లో రూ.28,422, 2014లో రూ.26,703, 2015లో రూ.24,931, 2016లో రూ.22,645గా ఉంది.

2017లో తులం బంగారం రేటు రూ.29,156, 2018లో రూ.31,931, 2019లో రూ.39,108, 2020లో రూ.50,151కి చేరుకుంది.

2021లో 10 గ్రాముల పసిడి రేటు రూ.48,099, 2022లో రూ.50,017, 2023లో రూ.63,203, 2024లో రూ.78,245, 2025లో రూ.1,02,170గా ఉండగా.. 2026 నాటికి ప్రస్తుతం రూ.1,50,000గా ఉంది.