AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఖాతాదారులకు అలర్ట్..

బ్యాంక్ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ప్రాంతీయ సెలవుల ఆధారంగా వేర్వురుగా ఒక్కొ రాష్ట్రంలో ఒక్కొలా బ్యాంక్ సెలవులు అనేవి ఉంటాయి. దీంతో వీటి గురించి ఖాతాదారులందరూ తెలుసుకోవాల్సి ఉంటుంది. వచ్చే వారంలో బ్యాంక్ సెలవుల గురించి ఒకసారి తెలుసుకుందాం.

Bank Holidays: వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే.. ఖాతాదారులకు అలర్ట్..
Bank Holidays
Venkatrao Lella
|

Updated on: Oct 10, 2026 | 11:01 AM

Share

కొత్త వారం వస్తుందంటే చాలు.. బ్యాంక్ సెలవులు కూడా మారుతూ ఉంటాయి. బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకునేందుకు ప్రతీఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే బ్యాంకులతో ప్రతీఒక్కరికీ అవసరముంటుంది. రోజువారీ నగదు అవసరాలు, రుణాలు వంటి పనుల కారణంగా బ్యాంకులతో పని ఉంటుంది. దీంతో ఏయే రోజుల్లో బ్యాంక్ సెలవులు ఉన్నాయనేది తెలుసుకోవడం ద్వారా ఖాతాదారులు ముందే జాగ్రత్త పడవచ్చు. ముందే తెలియడం వల్ల లావాదేవీలను ముందే ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం బ్యాంక్ సెలవులు ఉంటాయి. ఏడాది ప్రారంభం కావడానికి ముందే ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ విడుదల చేస్తుంది. దాని ప్రకారం బ్యాంకులు మూతపడతాయి. జాతీయ పండుగలతో పాటు ప్రాంతీయ పండుగల కారణంగా ఆర్బీఐ సెలవుల లిస్ట్ విడుదల చేస్తుంది. జాతీయ సెలవు దినాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు వర్తిస్తాయి. ఇక ప్రాంతీయ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి.

వచ్చే వారంలో బ్యాంక్ హాలీడేస్ ఇవే..

అక్టోబర్ 11వ తేదీన ఆదివారం సందర్బంగా బ్యాంకులు ఉండవు. ప్రతీ ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు దినం. ఈ కారణంగా బ్యాంక్ బ్రాంచ్‌లు ఓపెన్ చేసి ఉండవు. అక్టోబర్ 17న మహా సప్తమి కారణంగా అగర్తలాలోని బ్యాంకులు మూతపడనున్నాయి. వచ్చే వారంలో అక్టోబర్ 12 నుంచి 17వ తేదీ వరకు బ్యాంకులు పనిచేస్తాయి. వచ్చే వారంలో ప్రాంతీయ సెలవులు మాత్రమే ఉండగా.. జాతీయ సెలవులు లేకపోవడంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి.

ఈ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే..

అక్టోబర్ 19వ తేదీన దసరా, దుర్గా పూజ సందర్బంగా అగర్తల, ఐజ్వాల్, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, కోల్‌కతా, పాట్నా, రాంచీ, షిల్లాంగ్‌లలో బ్యాంకులు క్లోజ్ అవుతాయి. ఇక అక్టోబర్ 20వ తేదీన దసరా సందర్బంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. అక్టోబర్ 21న దుర్గా పూజ సందర్భంగా అగర్తల, బెంగళూరు, గ్యాంగ్‌టక్, గౌహతి, కొచ్చి, కోల్‌కతా తిరువనంతపురంలో బ్యాంకులు అందుబాటులో ఉండవు. అక్టోబర్ 22,23వ తేదీల్లో దుర్గా పూజ సందర్భంగా గ్యాంగ్ టక్‌లో బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 26న సోమవారం లక్ష్మి పూజ సందర్బంగా అగర్తలా, చండీగఢ్, జమ్మూ, సిమ్లా శ్రీనగర్‌లో బ్యాంకులు ఉండవు. అక్టోబర్ 31సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజును పురస్కరించుకుని అహ్మదాబాద్‌లో బ్యాంకులు బంద్ అవుతాయి.

Follow Us