AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్యూమినియం vs స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రెజర్ కుక్కర్.. రోజువారీ వంటకు ఏది సురక్షితం?

భారతీయ వంటగదిలో ప్రెజర్ కుక్కర్ లేని ఇల్లు ఉండదనడంలో సందేహం లేదు. అన్నం వండటం నుండి పప్పు, కూరగాయలు ఉడకబెట్టడం వరకు కుక్కర్ సమయాన్ని, ఇంధనాన్ని ఎంతగానో ఆదా చేస్తుంది. అయితే మార్కెట్‌లో లభించే అల్యూమినియం, స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్లలో ఏది మన ఆరోగ్యానికి శ్రేయస్కరం అనే విషయమై నిపుణులు పలు కీలక విషయాలను వెల్లడించారు.

అల్యూమినియం vs స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రెజర్ కుక్కర్.. రోజువారీ వంటకు ఏది సురక్షితం?
Aluminium Pressure Cooker
Jyothi Gadda
|

Updated on: Oct 10, 2026 | 10:40 AM

Share

భారతీయ వంటగదిలో ప్రెజర్ కుక్కర్ లేని ఇల్లు ఉండదనడంలో సందేహం లేదు. అన్నం వండటం నుండి పప్పు, కూరగాయలు ఉడకబెట్టడం వరకు కుక్కర్ సమయాన్ని, ఇంధనాన్ని ఎంతగానో ఆదా చేస్తుంది. అయితే మార్కెట్‌లో లభించే అల్యూమినియం, స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్లలో ఏది మన ఆరోగ్యానికి శ్రేయస్కరం అనే విషయమై నిపుణులు పలు కీలక విషయాలను వెల్లడించారు.

రోజువారీ వంటకాల్లో ప్రెజర్ కుక్కర్ల పాత్ర అత్యంత కీలకమైనది. అయితే అల్యూమినియం, స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్లలో ఏది ఆరోగ్యానికి సురక్షితమనే సందేహం చాలా మందికి ఉంటుంది. అల్యూమినియం కుక్కర్లు చవకగా లభించడంతో పాటు వేడిని వేగంగా వ్యాపింపజేస్తాయి., కానీ వీటిలో పులుపు ఉన్న పదార్థాలు వండినప్పుడు లోహం ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది. ఇది సుదీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. మరోవైపు, స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్లు కొంత బరువుగా, ధర ఎక్కువగా ఉన్నప్పటికీ,..

అల్యూమినియం ప్రెజర్ కుక్కర్లు

అల్యూమినియం కుక్కర్లు మన దేశంలో దశాబ్దాలుగా ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. ఇవి బరువు తక్కువగా ఉంటాయి. ధర కూడా చాలా అందుబాటులో ఉంటుంది. అల్యూమినియం వేడిని త్వరగా గ్రహించి సమంగా వ్యాపింపజేయడం వల్ల వంట వేగంగా పూర్తవుతుంది.

ఇవి కూడా చదవండి

కానీ, అల్యూమినియం లోహం ఆహారంతో సులభంగా రసాయనిక చర్య జరుపుతుంది. ముఖ్యంగా టమోటాలు, చింతపండు, నిమ్మకాయ వంటి ఆమ్ల గుణం ఉన్న పదార్థాలను ఇందులో వండినప్పుడు, అల్యూమినియం లోహపు అంశాలు ఆహారంలో కలిసే అవకాశం ఉంది. ఇది సుదీర్ఘకాలంలో నాడీ సంబంధిత, జీర్ణకోశ సమస్యలకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రెజర్ కుక్కర్లు

ప్రస్తుత కాలంలో చాలామంది స్టీల్ కుక్కర్లను ఉపయోగించడానికి మొగ్గు చూపుతున్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్ ఏ విధమైన ఆహార పదార్థాలతోనూ రసాయనిక చర్య జరపదు. అందువల్ల ఇందులో వండిన ఆహారం శుద్ధంగా మరియు సురక్షితంగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి చాలా కాలం మన్నికగా ఉంటాయి, తుప్పు పట్టవు, శుభ్రం చేయడం కూడా సులభం.

లోపాలు: ఇవి అల్యూమినియం కంటే బరువుగా ఉంటాయి. ధర కొంత ఎక్కువ. అలాగే స్టీల్ వేడిని నెమ్మదిగా గ్రహిస్తుంది. అయితే ప్రస్తుతం అడుగుభాగంలో అల్యూమినియం లేదా రాగి కోటింగ్ ఉండే సాండ్‌విచ్ బాటమ్ స్టీల్ కుక్కర్లు లభిస్తున్నాయి, ఇవి వేడిని వేగంగా వ్యాపింపజేస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us