AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi : చిరంజీవి సూపర్ హిట్ సినిమాకు 40 ఏళ్లు.. అప్పట్లో ఓ ఊపు ఊపిన పాట ఇదే..

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత విజయవంతమైన, సంచలన సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాలలో ‘రాక్షసుడు’ ఒకటి. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అప్పట్లో సంచలన విజయాలను నమోదు చేసింది. చిరంజీవి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించగా, రాధ కథానాయికగా నటించారు. సుహాసిని, శరత్ బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో విలన్ పాత్ర మరియు దాని చుట్టూ తిరిగే సన్నివేశాలు ప్రేక్షకులను తీవ్రంగా భయపెట్టడంతో పాటు సీటు అంచున కూర్చోబెడతాయి.

Megastar Chiranjeevi : చిరంజీవి సూపర్ హిట్ సినిమాకు 40 ఏళ్లు.. అప్పట్లో ఓ ఊపు ఊపిన పాట ఇదే..
Acha Acha Song
Rajitha Chanti
|

Updated on: Oct 10, 2026 | 10:55 AM

Share

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రాక్షసుడు’. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని పాటలు, ముఖ్యంగా మాస్ట్రో ఇళయరాజా అందించిన మ్యూజిక్ ఏ స్థాయిలో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలోని ప్రతి పాటా ఒక ఆణిముత్యమే. అందులోనూ ముఖ్యంగా “అచ్చా అచ్చా.. వచ్ఛా వచ్ఛా” అనే సాంగ్ శ్రోతలను ఇప్పటికీ ఉర్రూతలూగిస్తూనే ఉంటుంది. ఈ పాటకు సంబంధించిన లిరిక్స్ రాసే విషయంలో ప్రముఖ గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తి అనుసరించిన శైలి, దాని వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు సినీ వర్గాలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ‘రాక్షసుడు’ సినిమాలో చిరంజీవి, రాధ జంటపై తెరకెక్కిన ఈ ‘అచ్చా అచ్చా’ పాటకు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి తమ మధురమైన గాత్రంతో ప్రాణం పోశారు. ఇళయరాజా అందించిన ఊపునిచ్చే ఫోక్ అండ్ పాప్ మిక్స్డ్ బీట్స్‌కు తగ్గట్టుగా వేటూరి రాసిన పదాల కూర్పు అద్భుతంగా ఉంటుంది.

ఎక్కువమంది చదివినవి: Bathukamma Song : యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మంగ్లీ కొత్త బతుకమ్మ పాట.. గంటల్లోనే 

ఈ పాటకు సంబంధించి ఒక ఆసక్తికర సంఘటన సినీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అరేయ్ బచ్చా అంటూ కో-డైరెక్టర్‌ ఎవరినో అన్న మాటలు నిర్మాత కె.ఎస్‌. రామారావు చెవిన పడ్డాయి. వెంటనే గేయ రచయిత వేటూరిని కలిసిన తనకు ప్రత్యేకంగా ‘చ్చా’ శబ్దం వచ్చేలా ఒక పాటను రాయాలని కోరారు. ఆ శబ్దంతో ప్రత్యేకంగా పాటను ప్లాన్ చేయడమే కాకుండా, ఆ పాటలో ఎన్ని ‘చ్చా’లు వస్తాయో అన్ని వేల రూపాయల (ప్రతి ‘చ్చా’కు రూ. 1000) పారితోషికం ఇస్తామని నిర్మాత భారీ ఆఫర్ ప్రకటించారు. అలా ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ అంటూ పల్లవి ప్రారంభించి.. ‘నిండు జాబిల్లికైనా ఉందీ మచ్చా.. నీకు లేనందుకే నే మెచ్చా, మోజులన్నీ మోసుకొచ్చా.. ఈడు జోడు రంగరించా’ అంటూ పాటను అద్భుతంగా రంగరించారు. దీంతో, నిర్మాత తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆ సవాల్‌ను స్వీకరించిన లెజెండరీ లిరిసిస్ట్ వేటూరి తన కలం శక్తిని చూపించారు. అలా అప్పట్లోనే ఒక్కో పాటకు రూ. 1000 నుంచి రూ. 2000 వరకు పారితోషికం అందుకునే ఆయన, ఈ పాటలో ఏకంగా దాదాపు 50 ‘చ’కారాలు వచ్చేలా అద్భుతమైన సాహిత్యాన్ని సమకూర్చారు.

ఎక్కువమంది చదివినవి: Jaya Prada: ఆ హీరోకు అత్తగా నటించా.. అతడు అంటే నాకు పిచ్చి ఇష్టం.. జయప్రద..

సాధారణంగా తెలుగు సినిమా పాటలలో సాహిత్య విలువలు ఎంతో ఉన్నతంగా ఉండేలా చూసే వేటూరి, ఈ పాటలో మాత్రం సందర్భానికి తగినట్లుగా క్యాచీ అయిన హిందీ, ఉర్దూ పదాలను, ప్రాసలను అద్భుతంగా మిళితం చేశారు. “అచ్చా అచ్చా.. వచ్ఛా వచ్ఛా.. ఈడు వచ్చాక.. ఇట్టా వచ్చా.. నువ్వు నచ్చాక.. నీకే ఇచ్చా” అంటూ సాగే ఈ చరణాలు కుర్రకారును కట్టిపడేశాయి. పల్లెటూరి వాతావరణం, రొమాంటిక్ మూడ్‌ను ప్రతిబింబించేలా ఈ పాటలోని ప్రతి పదం సాగుతుంది. ఈ పాటలో వేటూరి వాడిన “కాసుకో ఘటోత్కచా.. కౌగిలే మజా”, “చీకటింట చిత్తగించా.. అందమంతా అప్పగించా” వంటి పద ప్రయోగాలు శ్రోతలను ఎంతగానో అలరించాయి. కేవలం క్యాచీ ట్యూన్ కోసం అర్థం లేని పదాలు వాడకుండా, పాటలోని మాస్ అప్పీల్ కోల్పోకుండానే చక్కటి అర్థం వచ్చేలా వేటూరి కలం నుంచి ఈ పాట జాలువారడం ఆయన మేధస్సుకు నిదర్శనం. తెలుగు సాహిత్యంతో పాటు విదేశీ, అన్యభాష పదాలను కూడా తనదైన శైలిలో కూర్చి ప్రేక్షకుల మనసులను గెలుచుకోవడం వేటూరికే చెల్లింది.

ఎక్కువమంది చదివినవి: Nana Patekar : నా ఆస్తి ఆ 12 ఎండు కట్టలే.. నేను ముందే పక్కన పెట్టుకున్నా.. నానా పటేకర్ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ..

అఛ్చా అఛ్చా సాంగ్..

ఎక్కువమంది చదివినవి: Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్ పర్సన్.. నటనలో మా ఇద్దరికీ పోటీ ఉండేది.. హీరో శ్రీకాంత్..

Follow Us