AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Connection: కొత్త ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు బంద్.. అయినా ఈ మార్గాల్లో పొందే ఛాన్స్.. సింపుల్‌గా ఇలా చేస్తే..

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నుంచి కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీని నిలిపివేసింది. దీంతో ఇంట్లో గ్యాస్ అవసరమైనవారు ఏం చేయాలనేది ప్రశ్నార్థకంగా ఉంది. కేంద్ర నిర్ణయంతో 14.2 కేజీల గృహ సిలిండర్ కనెక్షన్ల జారీపై నిషేధం అమల్లోకి వచ్చింది.

Gas Connection: కొత్త ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు బంద్.. అయినా ఈ మార్గాల్లో పొందే ఛాన్స్.. సింపుల్‌గా ఇలా చేస్తే..
Gas Connection
Venkatrao Lella
|

Updated on: Oct 10, 2026 | 10:28 AM

Share

అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం క్రమంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం, గ్యాస్ టాంకర్ల రవాణా నిలిచిపోవడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీని పూర్తిగా నిలిపివేసింది. మార్చి నుంచి దీనిని అమలు చేస్తుండగా.. ఏడు నెలలు గడిచినా కేంద్రం ఇంకా కనెక్షన్ల జారీని ప్రారంభించలేదు. దీంతో కొత్తగా గ్యాస్ కనెక్షన్ అవసరమైనవారు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొనగా.. సరుకు రవాణా వేగవంతం కాలేదు. గ్యాస్ సరఫరా కాస్త మెరుగుపడినప్పటికీ.. కొత్త కనెక్షన్ల జారీపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఈ క్రమంలో గ్యాస్ కష్టాలు తీర్చేందుకు కేంద్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.

5, 10 కేజీల సిలిండర్లు పొందవచ్చు

ఐదు కేజీలు, 10 కేజీల చోటా సిలిండర్లను కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టింది. కొత్త గ్యాస్ కనెక్షన్లకు బదులు వినియోగదారులు వీటిని తీసుకుని వినియోగించుకోవచ్చు. ఈ గ్యాస్ సిలిండర్లు పొందేందుకు పెద్దగా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా ఉండదు. ఏదైనా గుర్తింపు ధృవీకరణ పత్రం అందించి సులువుగా పొందవచ్చు. నేరుగా గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాల నుంచి వీటిని తీసుకోవచ్చు. 5 కేజీల ఫ్రీ ట్రేడ్ సిలిండర్లకు ఎలాంటి దరఖాస్తు ప్రక్రియ ఉండదు. సెక్యూరిటీ డిపాజిట్, అడ్రస్ ప్రూఫ్ లాంటివి అక్కర్లేదు. కేవలం ఆధార్, పాన్ లాంటి ఏదైనా వ్యక్తిగత డాక్యుమెంట్ అందించి తీసుకోవచ్చు. నేరుగా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయలం, రిటైట్ అవుట్ లెట్ల ద్వారా తీసుకోవచ్చు. కార్మికులు, బ్యాచిలర్లు, వలస కార్మికులు, అడ్రస్ ప్రూఫ్ లేనివారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ సిలిండర్లను పెట్రోల్ బంక్‌లు, కంపెనీల రిటైల్ అవుట్ లెట్ల వద్ద కూడా రీఫిల్ చేసుకోవచ్చు. ఏడాదిలో ఎన్నిసార్లైనా రీఫిల్‌కు అవకాశం ఉంటుంది.

మరో ఆప్షన్ పీఎన్‌జీ కనెక్షన్

ఇక 10 కేజీల సిలిండర్లను కూడా ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీసుకొచ్చాయి. ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ పేరుతో ప్రవేశపెట్టగా.. వీటి ధర రూ. 4853గా ఉంది. ఇక రీఫిల్ చేసుకోవాలంటే రూ.1667 చెల్లించాలి. ఇక హెచ్‌పీ నవ్య పేరుతో తీసుకొచ్చింది. హెచ్‌పీ పే ద్వారా ఈ సిలిండర్ కోసం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక బీపీసీఎల్ భారత్ గ్యాస్ లైట్ పేరుతో 10 కేజీల సిలిండర్లు తీసుకొచ్చింది. అలాగే నగరాల్లో పీఎన్‌జీ కనెక్షన్లను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. మీ ప్రాంతంలో పీఎన్‌జీ పైప్ లైన్లు ఉంటే కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒకే ఇల్లు-ఒకే గ్యాస్ అనే విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఒక ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ లేదా పీఎన్జీ కనెక్షన్లలో ఏదొ ఒకటి ఉండాలి. రెండు కనెక్షన్లు కలిగి ఉండటానికి వీల్లేదు. పీఎన్‌జీ కనెక్షన్ పొందిన తర్వాత ఎల్పీజీ కనెక్షన్లు వదులుకోవాల్సి ఉంటుంది. గ్యాస్ ఏజెన్సీ వద్ద సరెండర్ చేయాల్సి ఉంటుంది.

Follow Us