AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీలా జరగకూడదంటే.. వైభవ్ సూర్యవంశీ ఏం చేయాలి? కపిల్ దేవ్ సూచన

Vaibhav Sooryavanshi: భారతీయ క్రికెట్ సర్కిల్‌లో కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్, ఇండియా ఏ, ఐపీఎల్ టోర్నీలలో అద్భుతమైన ఆటతీరు కనబరిచిన ఈ యువ ఆటగాడు ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టులో కూడా చోటు సంపాదించుకున్నాడు.

Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీలా జరగకూడదంటే.. వైభవ్ సూర్యవంశీ ఏం చేయాలి? కపిల్ దేవ్ సూచన
Vaibhav Sooryavanshi
Rakesh
|

Updated on: Oct 10, 2026 | 9:43 AM

Share

Vaibhav Sooryavanshi: కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఈ యంగ్ ప్లేయర్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిన్న వయసులోనే పేరు, గుర్తింపు రావడం గొప్ప విషయమే. అయితే ఈ విజయాలను నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమని క్రికెట్ దిగ్గజాలు సూచిస్తున్నారు. భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై ఇప్పుడే పెద్ద అంచనాలు పెట్టుకోవద్దని సూచించారు. యువ ఆటగాడిలో ప్రతిభ ఉండటం ఒక్కటే సరిపోదని, దాన్ని నిలబెట్టుకోవడానికి క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చిన్న వయసులో వచ్చే పేరు, డబ్బు, అభిమానాన్ని సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యమని చెప్పారు.

వినోద్ కాంబ్లీ ఉదాహరణ ఎందుకంటే?

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీని ప్రస్తావిస్తూ ప్రతిభ ఉన్నంత మాత్రాన కెరీర్‌లో ఎప్పుడూ విజయాలు వస్తాయని చెప్పలేమనే విషయాన్ని కపిల్ దేవ్ గుర్తుచేశారు. ఆటపై దృష్టి పెట్టడం, క్రమశిక్షణతో ఉండటం, నిరంతరం నేర్చుకోవడం చాలా అవసరం. వైభవ్ కూడా ఈ విషయాలను గుర్తుంచుకుని ముందుకు సాగాలని ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి: IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి.. టీమిండియా బౌలర్లపై గవాస్కర్ ఫైర్

వైభవ్ బ్యాటింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా

వైభవ్ తన దూకుడైన బ్యాటింగ్‌తో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్న వయసులోనే భారీ షాట్లు ఆడుతూ బౌలర్లకు సవాల్ విసురుతున్నాడు. అతని ఆటతీరుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ప్రతి మ్యాచ్‌లోనూ ఇదే స్థాయిలో ఆడటం, పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయడం అతని ఎదుగుదలకు కీలకం కానుంది.

ఇది కూడా చదవండి: IND vs WI: బాదుడే బాదుడు.. ఒక్క మ్యాచ్‌లోనే మూడు రికార్డులను తిరగరాసేసిన టీమిండియా

రాబోయే మూడేళ్లు చాలా కీలకం

వైభవ్‌కు రాబోయే కొన్ని సంవత్సరాలు ఎంతో ముఖ్యమైనవి. ఈ సమయంలో తన ఆటను మెరుగుపరుచుకోవడంతో పాటు ఫిట్‌నెస్, క్రమశిక్షణ, మానసిక బలంపై దృష్టి పెట్టాలి. చిన్న వయసులోనే వచ్చిన గుర్తింపుతో ఒత్తిడికి గురికాకుండా, తన సహజమైన ఆటను కొనసాగించాలి. సరైన మార్గదర్శనం, కష్టపడే తత్వం తోడైతే వైభవ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us