AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాకీల కక్కుర్తి.. దొంగోడు దోచుకుంటే.. వీళ్లు పంచుకున్నారు.. చివరకు..

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో చోరీ కేసు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం, నగదు వివరాల్లో తేడాలున్నాయన్న ఆరోపణలు కలకలం రేపాయి. రికవరీ సొత్తును తక్కువగా చూపించారనే ఫిర్యాదులపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎస్సై విష్ణుమూర్తిని జిల్లా పోలీస్‌ కార్యాలయానికి అటాచ్‌ చేయగా, సీఐ సురేష్‌కు చార్జీ మెమో, డీఎస్పీ శివరామిరెడ్డికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

ఖాకీల కక్కుర్తి.. దొంగోడు దోచుకుంటే.. వీళ్లు పంచుకున్నారు.. చివరకు..
Nalgonda Police Scandal
M Revan Reddy
| Edited By: |

Updated on: Oct 10, 2026 | 10:06 AM

Share

దొంగల నుంచి దోచుకున్న సొత్తును తిరిగి రాబట్టాల్సిన పోలీసులే.. చేతివాటం ప్రదర్శించారు. నేరస్తుల నుంచి బంగారం, నగదు స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడ్డారు. బాధితులకు చెందాల్సిన సొమ్ములో పోలీసులు కక్కుర్తి, చేతివాటానికి పాల్పడడం కలకలం రేపుతుంది. పోలీస్‌ శాఖలో హాట్‌టాపిక్‌గా మారిన ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెంకు చెందిన అలుగుబెల్లి రాము తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడేవాడు. నార్కట్‌పల్లి, నల్లగొండతో పాటు హైదరాబాద్‌లోని పోచారం ప్రాంతంలోనూ అతనిపై దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా గత నెల 2న నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, నార్కట్ పల్లి ఎస్సై విష్ణుమూర్తిలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రామును అరెస్టు చేయడంతో పాటు అతని నుంచి రూ.19.20 లక్షల విలువైన బంగారం, రూ. 2.50 లక్షల నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.

అయితే.. ఈ వ్యవహారంలో పోలీసుల గోల్ మాల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 9 తులాల బంగారం, రూ.4 లక్షల మేర నగదు నిల్వలు తక్కువగా చూపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. రికవరీ సొమ్ములో చేతివాటానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో నార్కట్ పల్లి ఎస్సై విష్ణుమూర్తిని జిల్లా పోలీస్ కార్యాలయానికి ఉన్నతాధికారులు అటాచ్ చేశారు. పక్కదారి పట్టించిన సొమ్ములో ఇతర పోలీస్ అధికారులకు కూడా కొంత వాటా ముట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో సిఐ సురేష్ కు చార్జీ మెమో, నల్గొండ డిఎస్పి శివరామిరెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

నేరస్తులను పట్టుకోవడం పోలీసుల బాధ్యత అయితే.. స్వాధీనం చేసుకున్న సొత్తును పారదర్శకంగా భద్రపరచడం కూడా అంతే కీలకం. రికవరీలో తేడాలపై ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని కొట్టిపారేయడం కాదు.. ఆధారాలతో నిజానిజాలు వెల్లడించడమే ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టే మార్గమని పలువురు పేర్కొంటున్నారు..

Follow Us
ఖాకీల కక్కుర్తి.. దొంగోడు దోచుకుంటే.. వీళ్లు పంచుకున్నారు..
ఖాకీల కక్కుర్తి.. దొంగోడు దోచుకుంటే.. వీళ్లు పంచుకున్నారు..
విద్యార్హతలు - ఉపాధి అవకాశాల మధ్య అసలు వాస్తవాలు ఇవే..
విద్యార్హతలు - ఉపాధి అవకాశాల మధ్య అసలు వాస్తవాలు ఇవే..
ముడి చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. భారత్ రియాక్షన్ ఇదే..
ముడి చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. భారత్ రియాక్షన్ ఇదే..
జైలర్ 2 ట్రైలర్‏తో అందాల రాశి అరాచకం.. అసలు ఎవరు ఈ అమ్మాయి..
జైలర్ 2 ట్రైలర్‏తో అందాల రాశి అరాచకం.. అసలు ఎవరు ఈ అమ్మాయి..
AIపై స్టీఫెన్ హాకింగ్ చివరి హెచ్చరిక .. మానవాళికి ముప్పు కావచ్చు
AIపై స్టీఫెన్ హాకింగ్ చివరి హెచ్చరిక .. మానవాళికి ముప్పు కావచ్చు
వైభవ్ సూర్యవంశీకి కపిల్ దేవ్ వార్నింగ్
వైభవ్ సూర్యవంశీకి కపిల్ దేవ్ వార్నింగ్
మహిళలు ముఖం షేవింగ్ చేసుకోవచ్చా? డెర్మటాలజిస్టులు ఏం చెబుతున్నారు
మహిళలు ముఖం షేవింగ్ చేసుకోవచ్చా? డెర్మటాలజిస్టులు ఏం చెబుతున్నారు
మహాలయ అమావాస్య.. పితృదేవతల అనుగ్రహం కోసం ఈ రోజు చేయాల్సిన పనులివే
మహాలయ అమావాస్య.. పితృదేవతల అనుగ్రహం కోసం ఈ రోజు చేయాల్సిన పనులివే
టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్
వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్