AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు.. కానీ, మరొకరితో సన్నిహితంగా ప్రియురాలు.. చివరకు..

గుంటూరు జిల్లా తెనాలి మండలం కఠెవరం గ్రామానికి చెందిన రవితేజ ఇంట్లో మృతి చెందడం కలకలం రేపింది. పెయింటర్‌గా పనిచేస్తున్న అతడు రెండేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉద్యోగం, సంబంధంలో ఎదురైన సమస్యలతో అతడు మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి దారితీసిన పరిస్థితులపై అధికారిక విచారణ పూర్తయ్యే వరకు స్పష్టత రావాల్సి ఉంది.

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు.. కానీ, మరొకరితో సన్నిహితంగా ప్రియురాలు.. చివరకు..
Tenali Youth Death
T Nagaraju
| Edited By: |

Updated on: Oct 10, 2026 | 12:26 PM

Share

గుంటూరు జిల్లా తెనాలి మండలం కఠెవరానికి చెందిన రవి తేజ డిగ్రీ చదువుకున్నాడు. ప్రస్తుతం పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే నిన్న సాయంత్రం ఇంటికి వచ్చిన చూసిన తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. రవితేజ ఇంట్లోని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే రవితేజను కిందకి దించి చూడగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవితేజ రెండేళ్లుగా అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ కూడా ఇష్టపడటంతో పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే, ఇద్దరికి జాబ్స్ లేకపోవడంతో పెళ్లి వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే రవితేజ పెయింటర్ పనిచేస్తుండగా.. యువతి జాబ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లింది.

అక్కడకు వెళ్లిన దగ్గర నుంచి యువతి రవితేజతో మాట్లాడటం తగ్గించింది. దీంతో అనుమానం వచ్చిన రవితేజ ఆరా తీయగా మరొకరితో సన్నిహితంగా ఉంటుందని తెలిసింది. దీంతో రవితేజ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అయినప్పటికీ.. రవితేజ మరోసారి పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చినా.. ఆ యువతి మాత్రం దాటవేస్తూ వచ్చింది. దీంతో మరింత కుంగిపోయాడు.

ఒకవైపు జాబ్ లేకపోవడం మరొకవైపు ప్రేమించిన యువతి దూరం కావడంతోనే తనువు చాలించాలనుకున్నాడు. తనలో తాను మథనపడుతూ నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్న రవితేజ ముందుగా అనుకున్న ప్రకారమే చనిపోయాడు. అయితే తల్లిదండ్రుల వద్ద నుండి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రాణంగా ప్రేమిస్తే.. మరొకరితో సన్నిహితంగా ప్రియురాలు.. చివరకు
ప్రాణంగా ప్రేమిస్తే.. మరొకరితో సన్నిహితంగా ప్రియురాలు.. చివరకు
రణబాలి ట్రైలర్ పై నారా లోకేష్ ప్రశంసలు..
రణబాలి ట్రైలర్ పై నారా లోకేష్ ప్రశంసలు..
సామెత అర్థం: ఎగిరెగిరి దంచినా అంతే కూలి.. ఎగరక దంచినా అంతే కూలి!
సామెత అర్థం: ఎగిరెగిరి దంచినా అంతే కూలి.. ఎగరక దంచినా అంతే కూలి!
వారానికి ఒక్కసారైనా తినండి.. మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్..
వారానికి ఒక్కసారైనా తినండి.. మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్..
నవరాత్రుల్లో 9 రోజులు ఏయే అమ్మవారి రూపాలను పూజించాలి? నవదుర్గల..
నవరాత్రుల్లో 9 రోజులు ఏయే అమ్మవారి రూపాలను పూజించాలి? నవదుర్గల..
వెండిని మెరిపించడానికి ఖరీదైన కెమికల్స్ వద్దు.. గోధుమ పిండితో ఇలా
వెండిని మెరిపించడానికి ఖరీదైన కెమికల్స్ వద్దు.. గోధుమ పిండితో ఇలా
మంచి మూవీ తీసా.. కానీ చాలా పోగొట్టుకున్నా..
మంచి మూవీ తీసా.. కానీ చాలా పోగొట్టుకున్నా..
నడిరోడ్డుపై ఆకతాయికి దేహశుద్ధి చేసిన రకుల్..
నడిరోడ్డుపై ఆకతాయికి దేహశుద్ధి చేసిన రకుల్..
ఒకే ఒక్క స్పూన్ తింటే.. ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి బలం
ఒకే ఒక్క స్పూన్ తింటే.. ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి బలం
ఈ వస్తువులను దానం చేస్తే శుభప్రదం.. పొరపాటున కూడా వీటిని ఇవ్వకండి
ఈ వస్తువులను దానం చేస్తే శుభప్రదం.. పొరపాటున కూడా వీటిని ఇవ్వకండి