AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెండిని మెరిపించడానికి ఖరీదైన కెమికల్స్ వద్దు.. గోధుమ పిండితో ఇలా శుభ్రం చేయండి!

వెండి వస్తువులు, నాణేలు, ఆభరణాలు గాలిలో ఉండే సల్ఫర్‌తో చర్య జరపడం వల్ల కాలక్రమేణా తమ మెరుపును కోల్పోయి నల్లగా మారుతుంటాయి. వీటిని మళ్లీ కొత్త వాటిలా మెరిపించడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ పాలిష్‌లను ఆశ్రయించాల్సిన పనిలేదు. మన వంటింట్లో నిత్యం ఉపయోగించే గోధుమ పిండితో వెండిని అత్యంత సులభంగా ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెండిని మెరిపించడానికి ఖరీదైన కెమికల్స్ వద్దు.. గోధుమ పిండితో ఇలా శుభ్రం చేయండి!
How To Clean Silver At Home
Jyothi Gadda
|

Updated on: Oct 10, 2026 | 11:54 AM

Share

వెండి వస్తువులు, ఆభరణాలు గాలికి తగిలి క్రమేణా నల్లగా మారిపోతుంటాయి. వాటిని మెరిపించడానికి రసాయన క్లీనర్‌లను వాడవలసిన అవసరం లేదు. మన వంటింట్లో లభించే గోధుమ పిండితో వాటిని సులభంగా కొత్త వాటిలా మార్చవచ్చునని మీకు తెలుసా..? అంతేకాదు.. ఇది ఎటువంటి నష్టం కలగజేయని అత్యంత సురక్షితమైన, సహజమైన ఇంటి చిట్కా.

గోధుమ పిండి చిట్కా ఎలా పనిచేస్తుంది?

గోధుమ పిండి సహజంగానే జిడ్డును, మలినాలను పీల్చుకునే గుణం కలిగి ఉంటుంది. వెండి వస్తువులపై పేరుకుపోయిన నలుపుదనాన్ని తొలగించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

శుభ్రం చేసే విధానం:

ముందుగా ఒక గిన్నెలో రెండు లేదా మూడు చెంచాల గోధుమ పిండిని తీసుకుని, అందులో తగినన్ని నీళ్లు పోసి మందపాటి పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు నల్లబడిన వెండి ఆభరణాలు లేదా నాణేలపై ఈ పిండి మిశ్రమాన్ని పూర్తిగా పట్టించాలి. పిండి పూసిన వస్తువులను కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి, పిండి పూర్తిగా ఎండిపోయే వరకు గాలిలో వదిలేయాలి. పిండి పూర్తిగా ఎండిన తర్వాత, ఒక పాత సాఫ్ట్ టూత్‌బ్రష్ సహాయంతో వస్తువులను మెల్లగా రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి, పొడి గుడ్డతో తుడిస్తే వెండి వస్తువులు సరికొత్తగా మెరుస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇతర సులభమైన చిట్కాలు

గోధుమ పిండి కాకుండా, బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్ పద్ధతిని ఉపయోగించి కూడా వెండిని సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. అయితే ఈ పద్ధతుల్లో గోధుమ పిండి చిట్కా ఎటువంటి రసాయన ప్రభావం చూపదు కాబట్టి ఆభరణాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు. ఈ సులభమైన ఇంటి చిట్కాతో మీ పాత వెండి వస్తువులకు మళ్లీ సరికొత్త మెరుపును తీసుకురండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us