AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: లంక గడ్డపై అడుగుపెట్టిన శుభ్‌మన్ సేన.. మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే

రెండు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక చేరుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలకమైన ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆగస్టు 15 నుంచి గాలేలో, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరగనుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ సిరీస్ విజయంపై కన్నేసింది.

IND vs SL: లంక గడ్డపై అడుగుపెట్టిన శుభ్‌మన్ సేన.. మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే
Team India
SN Pasha
|

Updated on: Aug 04, 2026 | 8:10 PM

Share

భారత క్రికెట్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం శ్రీలంక చేరుకుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా జరిగే ఈ సిరీస్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. ఇటీవల పరిమిత ఓవర్ల సిరీస్‌ల అనంతరం రెడ్‌బాల్ క్రికెట్‌లో మరో సవాల్‌కు సిద్ధమైన టీమిండియా, శ్రీలంకలో విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

శ్రీలంక చేరుకున్న భారత జట్టు కొలంబోలో ప్రాక్టీస్ సెషన్‌లను ప్రారంభించనుంది. ప్రధాన సిరీస్‌కు ముందు శ్రీలంక ఎలెవన్‌తో సన్నాహక మ్యాచ్ ఆడనుంది. ఈ వార్మప్ మ్యాచ్‌ను నాలుగు రోజుల నుంచి మూడు రోజులకు కుదించినట్లు శ్రీలంక క్రికెట్ ఇప్పటికే ప్రకటించింది.

మొదటి టెస్టు గాలేలో..

భారత్-శ్రీలంక తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. స్పిన్‌కు అనుకూలించే గాలే పిచ్‌పై భారత బ్యాటర్లకు ఇది కీలక పరీక్షగా భావిస్తున్నారు. ఇక్కడ శ్రీలంకకు మంచి రికార్డు ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

రెండో టెస్టు కొలంబోలో..

రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని చారిత్రాత్మక సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) మైదానంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌తో రెండు టెస్టుల సిరీస్ ముగియనుంది. రెండు జట్లూ డబ్ల్యూటీసీ పాయింట్ల కోసం పోటీపడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

బుమ్రా గాయం.. ఆకిబ్ నబీకి అవకాశం

సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో జమ్మూ-కాశ్మీర్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీకి తొలి అవకాశం దక్కింది. కాగా శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు శ్రీలంకలో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుని ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ రేసులో బలమైన అడుగు వేయాలని చూస్తోంది. మరోవైపు స్వదేశంలో ఆడుతున్న శ్రీలంక కూడా భారత జట్టుకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. దీంతో గాలే, కొలంబో వేదికలుగా జరిగే ఈ రెండు టెస్టులు అభిమానులకు ఉత్కంఠభరితమైన క్రికెట్‌ను అందించనున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!