- Telugu News Photo Gallery Cinema photos Keerthy Suresh Acts In jewellery advertisement As Bride, Photos goes Viral
Keethy Suresh:పెళ్లి కూతురు గెటప్‌లో షాక్ ఇచ్చిన కీర్తి సురేశ్.. నెట్టింట ఫొటోస్ వైరల్
మహానటి కీర్తి సురేశ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. నానితో కలిసి ఆమె నటించిన దసరా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక దసరా సినిమాలో కీర్తి పోషించిన వెన్నెల పాత్రకు మంచి పేరొచ్చింది.
Basha Shek | Edited By: Anil kumar poka
Updated on: Apr 15, 2023 | 9:44 PM

మహానటి కీర్తి సురేశ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. నానితో కలిసి ఆమె నటించిన దసరా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

దసరా సినిమాలో కీర్తి పోషించిన వెన్నెల పాత్రకు మంచి పేరొచ్చింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తదుపరి సినిమా షూటింగ్‌లకు రెడీ అవుతోందీ అందాల తార.

అయితే అంతకుముందే పెళ్లి కూతురి గెటప్‌లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది కీర్తి. అయితే ఇది నిజమైన పెళ్లి కాదు. ప్రముఖ ఆభరణాల కంపెనీ ప్రమోషన్ యాడ్‌లో భాగంగా కీర్తి ఇలా కనిపించింది.

ఈ ఫొటోల్లో ట్రెడిషినల్ లుక్‌లో ఎంతో అందంగా కనిపిస్తోంది కీర్తి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది కీర్తి. అలాగే మామన్నన్, రివాల్వర్ రాణి, సైరన్ తదితర సినిమాలకూ ఓకే చెప్పింది.





























