- Telugu News Photo Gallery Cinema photos Senior Actress Radhika Sarathkumar interesting comments on political career
‘జయలలిత ఏదీ మర్చిపోరు.. నేను ఎప్పుడు కనిపించినా సీరియస్ లుక్ ఇచ్చేవారు’
స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం’ ప్రోగ్రాంలో ప్రముఖ వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా నటి రాధికా శరత్‌కుమార్‌తోపాటు సుప్రియ, స్వప్నదత్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటి రాధిక రాజకీయ జీవితం..
Updated on: Apr 18, 2023 | 8:20 AM

స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం’ ప్రోగ్రాంలో ప్రముఖ వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా నటి రాధికా శరత్‌కుమార్‌తోపాటు సుప్రియ, స్వప్నదత్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటి రాధిక రాజకీయ జీవితం, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటివరకూ జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ప్రతిదీ సీరియస్‌గా తీసుకుని ఎక్కువగా ఆలోచించడం మానేసి ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తున్నాను. నా తొలి సినిమా ‘న్యాయం కావాలి’ ద్వారా అనుకోకుండా నటి అయ్యాను. రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అది కూడా అనుకోకుండా జరిగిపోయింది.

అప్పట్లో డీఎంకే అగ్రనేత కరుణానిధి ఓసారి నన్ను కలిసి అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు వ్యతిరేకంగా ప్రచారం చేయమన్నారు. ఆ విషయం తెలిసిన తర్వాత నుంచి జయలలిత నన్ను కలిసిన ప్రతిసారి ఓ సీరియస్‌గా చూస్తూ.. ఏంటమ్మా ఎలా ఉన్నావ్?’ అని అడిగేవారు.

రాజకీయపరంగా నా భర్త శరత్‌కుమార్‌తో సత్సంబంధాలు ఉన్నప్పటికీ జయ మాత్రం నన్ను సీరియస్‌గానే చూసేవారు. ఆమె ఏదీ అంత సులువుగా మర్చిపోరని నటి రాధిక తెలిపారు.

ఆ తర్వాత ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సుప్రియ, నిర్మాత స్వప్నదత్‌లు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన విధానం, కెరీర్ గురించి పలు విషయాలు పంచుకున్నారు.




