Rajitha Chanti |
Updated on: Apr 16, 2023 | 11:22 AM
దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు మమితా బైజు. ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.
2017లో సర్వోపరి పాలక్కారన్ ద్వారా అరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే ఆడియన్స్ మనసు దోచుకుంది.
ఆ తర్వాత ఆపరేషన్ జావా, అల్ఫోన్సా, ఖో ఖో చిత్రాల్లో నటించి మెప్పించింది. చివరిగా ప్రణయ విలాసం చిత్రంలో కనిపించింది.
ప్రస్తుతం మమితా చేతిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా నిన్న విషు ఫెస్టివల్ సందర్భంగా సాగర తీరాన ఫోటోషూట్ చేసింది మమితా. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
శ్యామసుందరుడి కోసం రాధమ్మ తపన.. సాగరతీరాన రాధాకృష్ణ పిలుపులు అన్నట్లుగా ఉన్నాయి ఈ అందమైన ఫోటోస్.
అయితే మమితా ఇప్పటివరకు తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టలేదు. కేవలం మలయాళీ ఇండస్ట్రీలోనే కొనసాగుతుంది.
వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు సరైన స్టార్ డమ్ కోసం ఎదురుచూస్తుంది.
శ్యామసుందరుడి కోసం రాధమ్మ తపన.. సాగరతీరాన రాధాకృష్ణ పిలుపులు.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ?..