- Telugu News Photo Gallery Cinema photos Meet Nandini Gupta, The 19 Year Old Rajasthan Girl Who Has Been Crowned Femina Miss India 2023
Miss India 2023: అందుకే ఈ అందానికి అందరూ ఫిదా అయ్యారు.. ‘మిస్ ఇండియా’ ముద్దుగుమ్మ ఫొటోస్ చూశారా?
ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో రాజస్థాన్ కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్తా విజేతగా నిలిచింది. ఈ ఏడాదికి గానూ మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆమెకు గతేడాది మిస్ ఇండియాగా నిలిచిన సినీ శెట్టి అందాల కిరిటాన్ని అలంకరించారు.
Updated on: Apr 16, 2023 | 11:44 AM

అందాల పోటీల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫెమినా మిస్ ఇండియా 2023 పోటీలు మణిపూర్ వేదికగా అట్టహాసంగా జరిగాయి.

విధ రాష్ట్రాలకు చెందిన అందాల తారలు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ మెగా ఈవెంట్‌కు హాజరయ్యారు. బాలీవుడ్ సినిమా తారలు కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే డ్యాన్స్ చేసి ఆహూతులను అలరించారు.

ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో రాజస్థాన్ కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్తా విజేతగా నిలిచింది. ఈ ఏడాదికి గానూ మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆమెకు గతేడాది మిస్ ఇండియాగా నిలిచిన సినీ శెట్టి అందాల కిరిటాన్ని అలంకరించారు.

ఇదే ఈ పోటీల్లో ఢిల్లీకి చెందిన శ్రేయా పూన్జా మొదటి రన్నరప్‌గా, మణిపూర్‌కు చెందిన తౌనోజమ్ స్ట్రెలా లువాంగ్ రెండో రన్నరప్‌గా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గోమతి, తెలంగాణ నుంచి ఊర్మిళ చౌహాన్‌లు మిస్ ఇండియా పోటీల్లో తుది రౌండ్ వరకు గట్టిపోటీనిచ్చారు.

నందినీ గుప్తా స్వస్థలం రాజస్థాన్‌లోని కోట ఆమె స్వస్థలం. చిన్నప్పటి నుంచి చదువులో చాలా యాక్టివ్. సెయింట్ పాల్ సీనియర్ సెకండరీ స్కూల్ లో విద్యాభ్యాసం చేసింది. ప్రస్తుతం లాలా లజపతిరాయ్ కాలేజీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీ చదువుతోంది.

10 ఏళ్ల వయ సునుంచే మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకుందట నందిని. ఎప్పటికైనా ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను గెల్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందట. ఎట్టకేలకు 19 ఏళ్ల వయసులోనే తన కలసాకారమైందని తెగ సంబరపడిపోతోందీ అందాల రాణి

19 ఏళ్లకే మిస్ ఇండియా కిరీటం గెల్చుకున్న నందినీ గుప్తా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.




