AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లరి నరేశ్‌ ‘యముడికి మొగుడు’లో తళుక్కుమన్న ఈ హీరోయిన్ గుర్తుందా ? ఇప్పుడేలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

టాలీవుడ్‌లో ఇతర భాషల హీరోయిన్లు సందడి చేయడం కొత్తేమీ కాదు. అయితే అందులో కొందరు మాత్రమే క్లిక్ అవుతారు. మరికొందరు ఒకటి, రెండు సినిమాలతో సరిపెట్టుకుంటారు. అలాంటి వారిలో లక్నోకు చెందిన ముద్దుగుమ్మ రిచా పనయ్‌ ఒకరు. సుమారు దశాబ్ధ కాలం క్రితం యుముడికి మొగుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అందాల తార.

అల్లరి నరేశ్‌ 'యముడికి మొగుడు'లో తళుక్కుమన్న ఈ హీరోయిన్ గుర్తుందా ? ఇప్పుడేలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Yamudiki Mogudu Movie
Basha Shek
|

Updated on: Apr 15, 2023 | 11:46 AM

Share

టాలీవుడ్‌లో ఇతర భాషల హీరోయిన్లు సందడి చేయడం కొత్తేమీ కాదు. అయితే అందులో కొందరు మాత్రమే క్లిక్ అవుతారు. మరికొందరు ఒకటి, రెండు సినిమాలతో సరిపెట్టుకుంటారు. అలాంటి వారిలో లక్నోకు చెందిన ముద్దుగుమ్మ రిచా పనయ్‌ ఒకరు. సుమారు దశాబ్ధ కాలం క్రితం యుముడికి మొగుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అందాల తార. చిరంజీవి ‘యుముడికి మొగుడు’ సినిమా స్ఫూర్తితో సోషియో ఫాంటసీ కామెడీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లరి నరేశ్‌ హీరో. ఇందులో యుముడి (షయాజీ షిండే) కూతురు యమజ పాత్రలో కనిపించింది రిచా. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా వచ్చీరాని తెలుగు భాషలో ఆమె చెప్పే డైలాగులు బాగా పేలాయి. సినిమా కూడా సక్సెస్‌ అయ్యింది. దీని తర్వాత మనసు మాయ సేయకే, చందమామ కథలు, లవకుశ, సునీల్‌ ఈడు గోల్డ్‌ ఎహే, రక్షక భటుడు అనే సినిమాల్లో నటించి మెప్పించింది. నాయట్టు వంటి మలయాళం బ్లాక్‌ బస్టర్‌ సినిమాలతో అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. కొన్ని కన్నడ, హిందీ సినిమాల్లోనూ మెరిసింది. అయితే ఎక్కువ కాలం సినిమా కెరీర్‌ కొనసాగించలేకపోయింది.

2017లో క్రాస్‌ రోడ్‌ (లేక్‌హౌస్‌) అనే మలయాళ సినిమాలో చివరిగా కనిపించింది రిచా పనయ్‌. సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ మధ్యన ‘కిట్‌ క్యాట్ కేఫ్‌ స్టూడియో’ పేరుతో బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. అలాగే మళ్లీ మోడలింగ్‌లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఇటీవల కొన్ని ఎగ్జిబిషన్లలోనూ తళుక్కుమంది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌ చేసిన అనుభవముంది రాచాకు. అలాగే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌ గానూ పనిచేసింది. ఇక సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ తన ఫొటోలను షేర్‌ చేస్తుంటుందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

రిచా పనయ్ లేటెస్ట్ ఫొటోస్

View this post on Instagram

A post shared by Richa Panai (@richapanai)

View this post on Instagram

A post shared by KIT CAT CAFE (@kitcat.cafe)