Tollywood: నీలమేఘ శ్యాముడిగా మారిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. అందాల అప్సరస..
కొత్త ఆశలతో విషును స్వాగతిస్తూ.. మలయాళీలు కుటుంబసభ్యులతో కలిసి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. సంబరంగా ఈ పండగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఓ ఫేమస్ హీరోయిన్ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఎంతో ఘనంగా జరుపుకునే పండగా విషు. సంపద.. శ్రేయస్సు మరింత వృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ నల్లనయ్యకు ప్రత్యేకంగా కన్నపూలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఈరోజున తమ ప్రియమైనవారికి శుభాకాంక్షలు తెలుపుతుంటారు. కొత్త ఆశలతో విషును స్వాగతిస్తూ.. మలయాళీలు కుటుంబసభ్యులతో కలిసి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. సంబరంగా ఈ పండగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఓ ఫేమస్ హీరోయిన్ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. నీలమేఘ శ్యాముడిగా కనిపిస్తోన్న ఈ అమ్మాడి సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన మలయాళీ కుట్టి. ఎవరో గుర్తుపట్టండి.
నల్లనయ్యగా చిరునవ్వులు చిందిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. తుళు బ్యూటీ మంజు వారియర్. కొన్ని నెలల క్రితం తిరువనంతపురంలోని సూర్య ఫెస్టివల్లో రాధేశ్యామ్ నృత్య నాటకం ప్రదర్శించినప్పుడు మంజు ఇలా కృష్ణయ్యగా కనిపించారు. కృష్ణుడిపై రాధకు ఉన్న ప్రేమకథను చెప్పే రాధేశ్యామ్ నాటకమే.. మంజు వారియర్ మొదటి నృత్య నాటకం.
ఇదిలా ఉంటే.. మంజు వారియర్ మలయాళం.. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవలే అజిత్ కుమార్ సరసన తెగింపు చిత్రంలో నటించింది. ఆమె వయసు 44. కానీ ఆమెను చూస్తే అస్సలు నమ్మరు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మలయాళంలో స్టార్ హీరోయిన్ గా స్టేటస్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఇప్పటివరకు తెలుగు చిత్రాల్లో నటించలేదు. కేవలం నటిగానే కాదు.. నిర్మాతగా.. ప్లే బ్యాక్ సింగర్ గా.. క్లాసికల్ డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో కేవలం రెండు చిత్రాల్లో మాత్రమే నటించింది. నాలుగు పదుల వయసులోనూ ఇప్పటి కథానాయికలకు ధీటుగా అందంలో పోటీపడుతున్న మంజుకు.. పెళ్లిడుకొచ్చిన కూతురు ఉందంటే నమ్మడం కష్టమే.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.