Kantara Movie: ‘కాంతార’ చిత్రయూనిట్‌కు షాకిచ్చిన హైకోర్టు.. అసలేం జరిగిందంటే..
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వియ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కాంతార. ముందుగా కన్నడలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం, హిందీలోనూ రిలీజ్ చేయగా.. ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.
బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కాంతార చిత్రబృందానికి కేరళ హైకోర్టు షాకిచ్చింది. ఈ చిత్రంలోని వరాహ రూపం పాటను నిషేధిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. ఈ పాటను థియేటర్లు, డిజిటల్ ప్లాట్ ఫామ్స్, ఓటీటీ వేదికలలో ఎక్కడా కూడా ఉపయోగించరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సాంగ్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని పేర్కొంది. తైకుడం బ్రిడ్జ్ కు చెందిన నవరసం నుంచి కాపీ కొట్టారని హైకోర్టు వ్యాఖ్యనించింది.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలను మే 4లోగా అందజేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. గతంలోనూ ఈ సినిమా నుంచి పాటను తొలిగించాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వియ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కాంతార. ముందుగా కన్నడలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం, హిందీలోనూ రిలీజ్ చేయగా.. ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో రిషబ్ శెట్టి ఫాలోయింగ్ మారిపోయింది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ సైతం ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులోని వరాహరూపం పాటకు వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. అయితే ఈ సాంగ్ బాణీని కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన తైకుడం బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపిస్తూ న్యాయపోరాటానికి దిగింది. పిటిషన్ పై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు ఈ పాటను నిషేధించింది.
ముందుగా ఈ పాటను నిషేధించడంతో.. మరొ కొత్త సాంగ్ కంపోజ్ చేసి ఓటీటీలో ప్రసారం చేశారు. కానీ ఆ పాట ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు నిషేధం ఎత్తివేయడంతో ఒరిజినల్ సాంగ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ పాటను నిషేధిస్తూ ఉత్తర్వ్యూలు జారీ చేసింది కేరళ హైకోర్టు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.