AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: బాలీవుడ్ మరో స్టార్ హీరోతో సమంత సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా..

కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇవే కాకుండా.. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ .. సామ్ జంటగా సిటాడెల్ చిత్రం రూపొందిస్తున్నారు. హాలీవుడ్ మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఇదే కాకుండా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సినిమా చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Samantha: బాలీవుడ్ మరో స్టార్ హీరోతో సమంత సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా..
Samantha
Rajitha Chanti
|

Updated on: Apr 15, 2023 | 8:51 AM

Share

బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది టాలీవుడ్ హీరోయిన్ సమంత. ఆమె ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా నిన్న థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ మైథాలాజికల్ చిత్రంలో సామ్ శకుంల పాత్రను పోషించింది. ఈ మూవీనే కాకుండా.. మరోవైపు డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తుంది సామ్. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇవే కాకుండా.. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ .. సామ్ జంటగా సిటాడెల్ చిత్రం రూపొందిస్తున్నారు. హాలీవుడ్ మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఇదే కాకుండా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సినిమా చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురాన్ తో సమంత ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు డైరెక్టర్ అమర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రానికి వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్ టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం స్త్రీ 2 సినిమాతో బిజీగా ఉన్న అమర్.. ఆ తర్వాత సామ్, ఆయుష్మాన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక సామ్ సైతం ఖుషి, సిటాడెల్ చిత్రాలతో బిజీగా ఉండడంతో ఆయష్మాన్ తో చేయబోయే సినిమా కాస్త ఆలస్యంగానే స్టార్ట్ కానుందట. ఈ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది సామ్. ఇక ఆమె నటించిన శాకుంతలం సినిమా హిందీలో సైతం అంతగా ఆకట్టుకోలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నేలపై నడిచే బల్లి కంటపడిందా?.. అది మీకిచ్చే సంకేతమిదే..
నేలపై నడిచే బల్లి కంటపడిందా?.. అది మీకిచ్చే సంకేతమిదే..
పటాన్‌చెరు సమీపంలో ఓ చెరువులో కనిపించిన భయానక దృశ్యం,వణికిపోతున్న
పటాన్‌చెరు సమీపంలో ఓ చెరువులో కనిపించిన భయానక దృశ్యం,వణికిపోతున్న
పెద్ది సినిమాలో ఆ ఎపిసోడ్ ఇష్టం.. సీక్రెట్ రివీల్ చేసిన చరణ్..
పెద్ది సినిమాలో ఆ ఎపిసోడ్ ఇష్టం.. సీక్రెట్ రివీల్ చేసిన చరణ్..
తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌!
తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌!
వార్నీ ఇంత చీపా.. 1984లో మారుతి 800 కారు ధర ఎంతో తెలిస్తే ..
వార్నీ ఇంత చీపా.. 1984లో మారుతి 800 కారు ధర ఎంతో తెలిస్తే ..
ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్
ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్
60 ఏళ్లు.. 700కు పైగా సినిమాలు.. ఈ నటి ఎవరంటే..
60 ఏళ్లు.. 700కు పైగా సినిమాలు.. ఈ నటి ఎవరంటే..
తడి పాదాలతో నిద్రపోవద్దంటారు ఎందుకు..? లక్ష్మీ కటాక్షం తగ్గి..
తడి పాదాలతో నిద్రపోవద్దంటారు ఎందుకు..? లక్ష్మీ కటాక్షం తగ్గి..
రవి బాబు తల్లి ఎలా చనిపోయారో తెలుసా? పాపం అతని కళ్ల ముందే..
రవి బాబు తల్లి ఎలా చనిపోయారో తెలుసా? పాపం అతని కళ్ల ముందే..
వాషింగ్ మెషీన్‌లో సర్ఫ్ వాడుతున్నారా..? అసలు ఏది వేస్తే మంచిదో..
వాషింగ్ మెషీన్‌లో సర్ఫ్ వాడుతున్నారా..? అసలు ఏది వేస్తే మంచిదో..