Tollywood Movies: సమ్మర్ వినోదం మరింత ప్రత్యేకం.. ఈ వారం థియేటర్.. ఓటీటీలలో విడుదలయ్యే చిత్రాలు ఇవే..
రుద్రుడు, శాకుంతలం సినిమాలకు మిక్డ్స్ టాక్ వచ్చేసింది. ఇక ఈ వారం మరిన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ఆన్ లిమిటెడ్ ఎంట్రటైన్మెంట్ అందించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. మరీ ఈ వారం విడుదలకానున్న సినిమాలు ఏంటో తెలుసుకుందామా.
గత కొద్ది రోజులుగా బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలతోపాటు చిన్న చిత్రాలు కూడా సత్తా చాటుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. అలాగే… కంటెంట్ బాగుంటే స్టార్ హీరో సినిమానా లేదా అనేది చూడకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గతవారం విడుదలయిన చిత్రాలు ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన సంగతి తెలిసిందే. రుద్రుడు, శాకుంతలం సినిమాలకు మిక్డ్స్ టాక్ వచ్చేసింది. ఇక ఈ వారం మరిన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ఆన్ లిమిటెడ్ ఎంట్రటైన్మెంట్ అందించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. మరీ ఈ వారం విడుదలకానున్న సినిమాలు ఏంటో తెలుసుకుందామా.
విరూపాక్ష..
నూతన దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త జంటగా నటించిన చిత్రం విరూపాక్ష. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈమూవీ ఏప్రిల్ 21న విడుదల కానుంది. జరుగుతున్న చావులకు కారణం నేను తెలుసుకుని తీరతాను..ఈ రుద్రవనాన్ని కాపాడగల విరూపాక్షవి నువ్వే ట్రైలర్ లో వచ్చే డైలాగ్స్ ఆసక్తిని క్రియేట్ చేశాయి.
హలో.. మీరా.. !
గార్గేయి యల్లాప్రగడ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా హలో మీరా. కేవలం ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఈ సినిమా సాగనుంది. ఈ చిత్రానికి కాకర్ల శ్రీనివాసు దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంలో మీరా అనే పాత్ర చూట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది.
ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు..
డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. సుగా (డాక్యుమెంటరీ స్పెషల్)… ఏప్రిల్ 21
సోనీలివ్.. గర్మీ.. సిరీస్.. ఏప్రిల్ 21
నెట్ ఫ్లిక్స్.. హౌ టు గెట్ రిచ్.. ఇంగ్లీష్.. ఏఫ్రిల్ 18
చింప్ ఎంపైర్.. డాక్యుమెంటరీ.. ఏప్రిల్ 19
ది మార్క్ డ్ హార్ట్.. సీజన్ 2.. ఏప్రిల్19
చోటా భీమ్.. సీజన్ 17.. ఏప్రిల్ 20
టూత్ పరి.. హిందీ.. ఏప్రిల్ 20
డిప్లొమ్యాట్.. ఇంగ్లీష్.. ఏప్రిల్ 20
సత్య 2.. తెలుగు.. ఏప్రిల్ 21
రెడీ.. తెలుగు.. ఏప్రిల్ 21
ఇండియన్ మ్యాచ్ మేకింగ్.. వెబ్ సిరీస్.. ఏప్రిల్ 21
ఎ టూరిస్ట్స్ గైడ్ టు లవ్.. ఇంగ్లీష్.. ఏప్రిల్ 21
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.