Thangalaan: మాస్ లుక్లో అదిరిపోయిన హీరో విక్రమ్.. ‘తంగలాన్’ మేకింగ్ వీడియో చూస్తే గూస్ బంప్స్ ఖాయం..
తాజాగా ఈరోజు విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రతి ఒక్క యాక్షన్ సీన్ కూడా గూస్ బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. విక్రమ్ తన భూమిని అణచివేతదారుల నుంచి రక్షించడానికి బయలుదేరిన నాయకుడిలా కనిపించాడు.
తమిళ్ స్టార్ హీరో విక్రమ్ గురించి పరిచయం అవసరం లేదు. అపరిచితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ స్టార్ హీరో. ఓవైపు మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ సినిమా చేస్తూనే.. మరోవైపు డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో తంగలాన్ మూవీ చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ మూవీలో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. తాజాగా ఈరోజు విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రతి ఒక్క యాక్షన్ సీన్ కూడా గూస్ బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. విక్రమ్ తన భూమిని అణచివేతదారుల నుంచి రక్షించడానికి బయలుదేరిన నాయకుడిలా కనిపించాడు.
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం విక్రమ్ చాలా కష్టపడినట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన వీడియోలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ మరింత అదిరిపోయింది. కెఇ జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఇందులో పశుపతి మాసిలామణి, పార్వతి తిరువోతు కీలకపాత్రలలో నటిస్తున్నారు. 1880ల కాలంలో సాగే పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీని తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ సినిమా 3డీలో తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తెలుగుతోపాటు.. తమిళం, హిందీలోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Thank you for all the love pouring in. Am moved beyond words. ?உங்களுக்காக என்னோட சிறிய பிறந்தநாள் பரிசு. (Ur a rockstar Ranjith. நன்றிகள் பல.) #Thangalaan @beemji @StudioGreen2 https://t.co/Vm6R9EJJRD pic.twitter.com/6jD666KlwE
— Vikram (@chiyaan) April 17, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.